ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోడు భూముల్లో సాగు అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:22 PM

దశాబ్దాల నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు సాగు పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐ కేఎంఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి హెచ్చరించారు.

అటవీ భూముల్లో నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐకేఎంఎస్‌ నాయకులు, గిరిజన రైతులు

ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి

నెన్నెల, జూలై 12 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాల నుంచి గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు సాగు పనులను అడ్డుకుంటే ఊరుకునేది లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐ కేఎంఎస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం తిరుపతి హెచ్చరించారు. మండ లంలోని జంగాల్‌పేట పంచాయతీ పరిధి కొత్తగూడెం శివారు భూముల్లో ఏఐకేఎంఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి శనివారం ఆందోళన చేపట్టారు. అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 50 ఏళ్లుగా ఈ భూములను స్థానిక గిరిజనులు సాగు చేసుకుంటున్నారని అన్నారు. కొందరికి 1/70 చట్టం ప్రకారం పట్టాలు కూడా ఉన్నాయన్నారు. ఆ భూమిని దున్నితే కేసులు పెడతామని అటవీ శా ఖ వారు బెదిరిస్తున్నారని అన్నారు. ఎన్నికల కంటే ముందు అటవీ భూ ముల్లో సాగులో ఉన్నవారికి హక్కు పత్రాలు ఇస్తామని కాంగ్రెస్‌ నాయ కులు ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని విమర్శించారు. ఆదివాసీల హక్కులను కాలరాసే జీవో నం. 49ను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. భూములు దక్కేంత వరకు గిరిజనులకు అండగా పోరాడుతామన్నారు. మాజీ ఉప సర్పంచ్‌ చిలుకయ్య, నాయకు లు మంచాల మధునయ్య, నాగే ష్‌, వెంకటేష్‌, సాగర్‌, దిలీప్‌, క మల, దుర్గక్క, లక్ష్మీ, భీమక్క పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:22 PM