ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నా నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదు..

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:39 PM

మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని.. నియోజకవర్గానికి నేనే రాజును నేనే మంత్రిని అని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని.. నియోజకవర్గానికి నేనే రాజును నేనే మంత్రిని అని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు సంబురాల్లో మునిగిపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మంత్రి అయితే రెండు పార్టీలు తెగ సంతోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నా రన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి నేనే రాజును నేనే మంత్రిని అన్నారు. ఇక్కడ ఎవరి జోక్యం అవసరం లేదని అన్నారు. మంచిర్యా లలోని ప్రధాన వీధుల సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభమవు తాయన్నారు. రోడ్లు విస్తారంగా ఉంటేనే భావితరాలకు అభివృద్ధిని అందించిన వారమవుతామ న్నారు. రోడ్లవిస్తరణలో కొందరికి నష్టం జరిగినా తరువాత కాలంలో వ్యాపారాలు ఊపందుకుంటాయన్నారు. విశ్వనాథాలయం దుకాణాల సముదాయం కూల్చివేతకు అనుమతి లభించిందని కూల్చివేత పనులు గురువారం ప్రారంభిస్తామన్నారు. వేంపల్లిలో ఐటీ పార్కుకు ఆమోదం ముద్ర పడిందని తెలిపారు. ఆటోనగర్‌ పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్‌, నాయకులు పూదరి తిరుపతి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:39 PM