జీవో నంబర్ 49 రద్దు చేయాలి
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:39 PM
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాల నాయకులు సోమవారం ఫారెస్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఎఫ్‌ఆర్‌వో మజారోద్ది న్‌కు వినతిపత్రం సమర్పించారు.
కెరమెరి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 49ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాల నాయకులు సోమవారం ఫారెస్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ఎఫ్‌ఆర్‌వో మజారోద్ది న్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవో నంబర్ 49 ద్వారా ఆదివాసీ గ్రామాలు కనుమరుగవు తాయని అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంట నే జీవోను రద్దుచేయాలని లేని పక్షంలో అందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజ య్‌కుమార్, ఆదివాసి సంఘాల నాయకులు భరత్ భూషన్, రాజేశ్వర్, ప్రభాకర్, జంగు పాల్గొన్నారు.
వాంకిడి: జీవో నంబరు 49ని వెంటనే రద్దు చేయాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవా విజయ్ కుమార్ డిమాండ్ చేశా రు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాల యం ఎదుట తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కవిత, ఆటవీశాఖ సెక్షన్ అధికారికి వినతిపత్రాలు అందజేశా రు. కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు కీనక ప్రభాకర్, పెందుర్ మారుతి, కోట్నక రాంషా, కినక రాము, సోయం సంజీవ్, వుయికే రాము, మడావి భీంరావు, సీడాం పగ్గు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు పాల్గొన్నారు.
జైనూర్: ఆదివాసులను అడవీ నుంచి దూరం చే యాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేయనున్న జీవో 49ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కుంర శాంరావ్, పేసా చట్టం మొబలైజర్ కుంర విష్ణు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి జుగునాక శంకర్ తదితరులు పాల్గోన్నారు.
సిర్పూరు(టి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినజీవో 49ను వెంటనే రద్దు చేయాలని సోమవారం తహసీల్దార్ మహ్మద్ రహీమోద్దీన్‌కు ఆదివాసీ సంఘాల నాయకులు గంట గోపాల్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమురం భీం జిల్లా టైగర్ రిజర్వుగా చేసి జీవో 49 విడుదల చేయటం దారుణమన్నారు. అనేక గిరిజన గ్రామాలను అణ్యక్రాంతమవుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:39 PM