ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిధులు గోల్‌మాల్‌

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:42 PM

జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీలో ఉన్న ’మంచిర్యాల క్లబ్‌’ లో పెద్ద మొత్తంలో నిధులు గోల్‌మాల్‌ అయినట్లు తెలుస్తోంది. రిక్రియేషన్‌ పేరిట నిర్వహిస్తున్న క్లబ్‌లో పేకాటే ప్రధానంగా కార్యకలాపాలు సాగుతుండగా, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, షటిల్‌ కోర్టు కూడా అందుబాటులో ఉన్నాయి.

- మంచిర్యాల క్లబ్‌లో రూ. మూడు కోట్ల మేర మాయమైన నగదు

- రిక్రియేషన్‌ పేరుతో సభ్యత్వ స్వీకరణ

- ఒక్కో సభ్యుడి వద్ద రూ. లక్షకుపైగా వసూలు

- పేకాటనూ ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు

మంచిర్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీలో ఉన్న ’మంచిర్యాల క్లబ్‌’ లో పెద్ద మొత్తంలో నిధులు గోల్‌మాల్‌ అయినట్లు తెలుస్తోంది. రిక్రియేషన్‌ పేరిట నిర్వహిస్తున్న క్లబ్‌లో పేకాటే ప్రధానంగా కార్యకలాపాలు సాగుతుండగా, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, షటిల్‌ కోర్టు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ సభ్యత్వం పొందాలంటే పెద్దమొత్తంలో సభ్యత్వ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. క్లబ్‌కు అనుసంధానంగా బార్‌ కూడా ఉండటంతో పేకాట ఆడుతూ మద్యం సేవించడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది. ఇందులో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్‌ ఎస్టేట్‌, వడ్డీ వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ పేకాట నిత్యకృత్యమన్న విషయం రామగుండం కమిషనరేట్‌ పోలీసుల దాడుల్లో వెల్లడైంది.

- ఖరీదైన సభ్యత్వం....

మంచిర్యాల క్లబ్‌లో సభ్యత్వం అత్యంత ఖరీదైంది. డబ్బులు కట్టగలిగే స్తోమత ఉంటే చాలు.. ఎలాంటి అర్హత లేకపోయినా ఇక్కడ సభ్యత్వం తీసుకోవచ్చు. ప్రస్తుతం మంచిర్యాల క్లబ్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే రుసుం కింద 1.5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. పేకాట వ్యసనం ఉన్నవారు స్తోమత లేకపోయినా ఫైనాన్స్‌ల్లో అప్పులు తెచ్చి మరీ సభ్యత్వం తీసుకుంటారని వినికిడి. మంచిర్యాల క్లబ్‌లో ప్రస్తుతం 750కుపైగా సభ్యులు ఉన్నారు. క్లబ్‌లో లక్షలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారిలో అనేక మంది పేకాటలో నష్టాలు వచ్చి రోడ్డున పడ్డవారేనన్న ప్రచారమూ ఉంది. సంపన్నుల సంగతి పక్కన బెడితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఉన్నది పోగొట్టుకున్న వారే ఇక్కడ అధికంగా ఉన్నట్లు సమాచారం.

- నిబంధనలకు పాతర...

రిక్రియేషన్‌ పేరిట కొనసాగుతున్న మంచిర్యాల క్లబ్‌లో రమ్మీ పేరిట జూదం ఆడుతుంటారని సమాచారం. ఒక్కో గేమ్‌కు మూడువేల రూపాయల చొప్పున చెల్లిస్తూ, పెద్దమొత్తంలో పేకాట రాయుళ్లు పందెం కాస్తుంటారు. ప్రతీరోజు దాదాపు 100 మంది వరకు ఇక్కడ పేకాట ఆడుతుంటారు. వీటికి అదనంగా క్లబ్‌ నిర్వాహకులు సభ్యులకు రిక్రియేషన్‌ టూర్లు ఏర్పాటు చేస్తుంటారు. సాయంత్రం వేళ వందలాది మంది పేకాట కోసం ఇక్కడికి వస్తుంటారని సమాచారం. అయితే నేరుగా డబ్బులు టేబుల్‌పై ఉంచకుండా కాయిన్‌లు ఉపయోగిస్తూ గేమ్‌ ఆడుతుంటారు.

- పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ పేకాట రాయుళ్లు...

రామగుండం కమిషనరేట్‌ పోలీసులు 2019 జూన్‌ 3న మంచిర్యాల క్లబ్‌పై దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న 36 మందిని అరెస్టు చేశారు. దాడుల సందర్భంగా పేకాట రాయుళ్ల నుంచి పోలీసులు 237 కాయిన్‌లతోపాటు రూ. 6.21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్రమంగా సాగుతున్న పేకాట బాగోతం బట్టబయలైంది. ఇలా పలుమార్లు క్లబ్‌పై పోలీసుల దాడులు జరుగగా, కొంతకాలం తరువాత మళ్లీ తమ కార్యకలాపాలు కొనసాగించడం ఆనవాయి తీగా వస్తోంది. కరోనా సమయంలో కొంతకాలంపాటు క్లబ్‌లో కార్యకలాపాలు నిలిచిపోగా, మళ్లీ ఊపందుకున్నాయి.

- రూ. మూడు కోట్లు పక్కదారి..

మంచిర్యాల క్లబ్‌ నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈకమిటీ ఆధ్వర్యంలోనే వివిధ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. గతంలో ఐబీ సమీపంలో ఉన్న క్లబ్‌ను 15 సంవత్సరాల క్రితం హైటెక్‌సిటీలోని నూతన భవనంలోకి మార్చారు. అప్పటి నుంచి సభ్యత్వం తీసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరిగింది. క్లబ్‌ పేరిట బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా పెరిగాయి. దాదాపు మూడు కోట్ల రూపాయల పై చిలుకు నిధులు క్లబ్‌పేరిట బ్యాంకుల్లో జమ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు నూతన కమిటీని ఎన్నుకోవలసి ఉండగా, దశాబ్దకాలం పాటు అదే కమిటీని కొనసాగించారు. ఆసమయంలో కమిటీ సభ్యులది ఆడిందే ఆటగా తయారైంది. కాలక్రమేణా బ్యాంకుల్లో నిల్వ ఉన్న నగదు మొత్తం మాయమైంది. ప్రస్తుతం క్లబ్‌ పేరిట చిల్లగవ్వ కూడా లేదని సమాచారం. సాఽధారణంగా టూర్‌ల సమయంలో సభ్యులు 40 శాతం, క్లబ్‌ నుంచి 60 శాతం ఖర్చులు వెచ్చిస్తుంటారు. డబ్బు లు లేకపోవడంతో నాలుగైదు సంవత్సరాలుగా టూర్‌లు బంద్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ మధ్యకాలంలో హైద్రాబాద్‌లో ఉన్న పలు క్లబ్‌లతో మంచిర్యాల క్లబ్‌ను అనుసంధానం కూడా చేసినట్లు తెలిసింది. తద్వారా మంచిర్యాల క్లబ్‌ సభ్యులకు హైద్రాబాద్‌కు వెళ్లి కూడా పేకాట ఆడే వెసులుబాటును నిర్వాహకులు కల్పించారు. క్లబ్‌లో నిధుల గోల్‌మాల్‌ విషయమై జోరుగా చర్చ జరుగుతుండటం, మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు క్లబ్‌లో గోల్‌మాల్‌ అయిన నిధులను కక్కిస్తాని బాహాటంగా హెచ్చరించడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

Updated Date - Jul 02 , 2025 | 11:42 PM