రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
ABN, Publish Date - Jan 02 , 2025 | 11:14 PM
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్‌తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సంబంధిత గోడ ప్రతులను విడుదల చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్‌తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సంబంధిత గోడ ప్రతులను విడుదల చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు, ఇతర వాహనచోదకులు సీటు బెల్టు ధరించాలన్నారు. వేగంగా వాహనాలు నడపవద్దని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపవద్దన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహి స్తామన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 02 , 2025 | 11:14 PM