ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

ABN, Publish Date - Jan 04 , 2025 | 10:56 PM

సొంతిళ్లు పేద, మధ్యతరగతి గూడు కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంది రమ్మ పేరుతో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిం చింది. ఇందుకుగానూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మహిళల పేరిట దరఖాస్తులు స్వీకరించింది. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా కేవలం అర్హులకు లబ్ధి జరిగేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మంచిర్యాల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సొంతిళ్లు పేద, మధ్యతరగతి గూడు కల్పించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంది రమ్మ పేరుతో ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయిం చింది. ఇందుకుగానూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో మహిళల పేరిట దరఖాస్తులు స్వీకరించింది. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా కేవలం అర్హులకు లబ్ధి జరిగేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పది రోజులుగా సిబ్బంది జిల్లాలోని దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వే సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల ఫొటోలు తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, ఇల్లు నిర్మించుకునేందుకు భూమి అందుబాటులో ఉందా? లేదా? స్థలం ఉంటే ఎవరి పేరిట ఉంది, ఇంట్లో ఉన్న వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుతం అక్కడ ఎన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు, లబ్ధిదారు దివ్యాం గులా, ఆనాథలా, ఒంటరి మహిళా, వితంతువా, ట్రాన్స్‌ జెండర్లు, పారిశుధ్య కార్మికులు వంటి వాటిని యాప్‌ ద్వారానే గుర్తించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆయా విభాగాల వారికే ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ప్రతీ మండలంలో నమూనా ఇంటి నిర్మాణం చేపట్టి, దాని ప్రకారంగానే ఇళ్ల నిర్మాణం ఉంటుందని అధికారులు ప్రజలకు చూపించేందుకు ప్రయత్నిస్తు న్నారు. నమూనా ఇళ్ల నిర్మాణాన్ని ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

వివరాలు యాప్‌లో నమోదు...

ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా ఇళ్ల సర్వే చేస్తున్న సిబ్బంది మహిళల నుంచి స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా గ్రామాల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గెజిటెడ్‌ స్థాయి అధికారి సర్వేను పరిశీలించనున్నారు. ప్రజాపాలనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకోసం 2 లక్షల 5వేల 939 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,719 దరఖాస్తులను పరిశీలించగా, వివరాలను వెంట వెంటనే సిబ్బంది ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. మొదట్లో కొంత సర్వే నత్తనడకన సాగగా, ప్రస్తుతం వేగం పుంజు కుంది. 20 రోజులుగా మండలాలు, మున్సిపాలిటీల్లో సర్వే చేపడుతుండగా, లక్ష్యాన్ని చేరుకునే దిశగా సర్వే సాగుతోంది. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల సంఖ్య ఎక్కు వగా ఉండగా కొంత ఆలస్యం అవుతోంది. అయితే వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారనే విషయాలను సేకరించి, ప్రభుత్వానికి నివేదించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సర్వేకు వచ్చిన సిబ్బందికి దరఖాస్తుదారులు సంబంధిత ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచి, అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెబితే సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని, ఇందుకు దరఖాస్తుదారులు సహకరిం చాలని అధికారులు సూచిస్తున్నారు. సిబ్బందికి సహక రించి సరైన వివరాలు అందిస్తే సర్వే ప్రక్రియ త్వరగా పూర్తికావడంతోపాటు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి మొదటి దశలో అత్యంత పేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిం చాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే అనంతరం జాబితాను ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో గల ఇందిరమ్మ కమిటీలకు అందించనున్నారు. కమిటీ సభ్యులు ఆయా జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించి అర్హులా, కాదా అనే విషయాన్ని నిర్ధారించిన తరువాత అర్హులకు ఇళ్లను మంజూరు చేయనున్నారు.

స్థలాలు ఉన్న వారికి రెండో విడుతలో....

ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ పథకం రెండో విడుతలో ఎంపిక చేయనున్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందజేస్తారు. బేస్మెంట్‌ మొదలు కొని స్లాబ్‌, తదితర పనులను బట్టి నిర్ణయించిన నగదును విడుతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారు ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలకు మరింత సొమ్మును కలిపి ఇళ్లును తమ ఆలోచనా విధానాలకు అనుగుణంగా నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

Updated Date - Jan 04 , 2025 | 10:56 PM