కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
ABN, Publish Date - Jan 05 , 2025 | 11:03 PM
పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తను గుర్తిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ పసివుల్లాతోపాటు పది మంది డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిం చారు.
జన్నారం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తను గుర్తిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ పసివుల్లాతోపాటు పది మంది డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవుల కోసం ఎవరూ నిరాశ పడవద్దని, వచ్చే స్ధానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేం దుకు కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామ న్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు అధికారులను సమన్వయం చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాల న్నారు. అనంతరం పాలకవర్గాన్ని ఘనం గా సన్మానించారు. జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ షాబోద్దీన్, సెక్రెటరీ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, పొనకల్ సహకార సంఘం చైర్మన్ అల్లం రవి, పాల్గొన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 11:03 PM