అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN, Publish Date - Apr 16 , 2025 | 11:24 PM
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. బుధవారం మండలంలోని అందవెల్లిలో రూ.10లక్షలతో చేపట్టిన సిమెంటు రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
- సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
కాగజ్‌నగర్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. బుధవారం మండలంలోని అందవెల్లిలో రూ.10లక్షలతో చేపట్టిన సిమెంటు రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. పనులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చన్కాపురి గణపతి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మల్లేష్, శ్రవణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పశువుల కోసం ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ విజయ్, డాక్టర్ పరిమళ, డాక్టర్ రాజ్‌కుమార్, గోపాల మిత్ర రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
దహెగాం (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. దహెగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో 80 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకు రావడంతో దహెగాం- కోత్మీర్ గ్రామాల మధ్య 12 కిలో మీటర్ల డబుల్ రోడ్డు పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని పేర్కొన్నారు. దహెగాం మండ ల కేంద్రంలోని సీనియర్ కార్యకర్త నారా సుధాకర్, నారా లచ్చన్న తల్లి రెండో రోజుల క్రితం మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామ ర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కవిత, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిగౌడ్, నాయకులు ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 35 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని చౌరస్తాలో ఘనపురం సుశీల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించా రు. మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర రావు, ఎంపీడీవో ఆల్బర్ట్, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2025 | 11:24 PM