ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అడ్వాన్స్‌ టెక్నాలజీతోనే అభివృద్ధి

ABN, Publish Date - May 06 , 2025 | 12:22 AM

అడ్వాన్స్‌ టెక్నాల జీతోనే విద్యార్ధులు అభివృద్తిపథంలో ముందుంటారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి సందర్శించారు.

పరికరాలను పరిశీలిస్తున్న ఎంపీ వంశీకృష్ణ

- విద్యార్ధులు సాంకేతిక రంగంలో ముందుండాలి

- ఎంపీ వంశీకృష్ణ

మందమర్రి టౌన్‌, మే 5(ఆంధ్రజ్యోతి) : అడ్వాన్స్‌ టెక్నాల జీతోనే విద్యార్ధులు అభివృద్తిపథంలో ముందుంటారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి సందర్శించారు. సెంటర్లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన నిర్వాహకులతో టెక్నాలజీ శిక్షణ ఉపకరణాల అందుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్ధుల అభ్యున్నతికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ముందుంటానని పేర్కొన్నారు. ఈ సెంటర్లో ఉన్నటువంటి టెక్నాలజీని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణ యువతకు ఆధునిక శిక్షణ అందించడంలో ఈ సెంటర్‌ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ మార్గదర్శకాలు రూపుదిద్దుతు న్నాయని, ఆ దిశగా కూడా విద్యార్ధులు ముందుకు సాగాలని తెలిపారు. భారతదేశం కూడా ప్రపంచ దేశాలతో సాంకేతిక రంగంలో పోటీ పడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆయన విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. మొదటిసారి సందర్శించిన ఎంపీకీ కలెక్టర్‌ పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.

ఫఏటీసీ సెంటర్లో ఎంపీ వంశీకృష్ణ సోమవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటా లని పేర్కొన్నారు. సెంటర్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:22 AM