డెంగ్యూ అవగాహన ర్యాలీ
ABN, Publish Date - May 16 , 2025 | 11:49 PM
నస్పూర్, మే 16 (ఆంధ్రజ్యోతి) : జాతీయ డెంగ్యూ దినోత్సవం సంద ర్భంగా నస్పూర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ అవగాహన ర్యాలీని జిల్లా ఉప ఽవైద్యాధికారులు అనిత, సుధాకర్ నాయ క్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద నుం చి నస్పూర్ గేటు, కలెక్టరేట్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ కొనసాగిం ది.
నస్పూర్, మే 16 (ఆంధ్రజ్యోతి) : జాతీయ డెంగ్యూ దినోత్సవం సంద ర్భంగా నస్పూర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ అవగాహన ర్యాలీని జిల్లా ఉప ఽవైద్యాధికారులు అనిత, సుధాకర్ నాయ క్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద నుం చి నస్పూర్ గేటు, కలెక్టరేట్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ కొనసాగిం ది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ నివారణలో ప్రజలు, స్వ చ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అందరూ భాగస్వామ్యం కావాలని, తద్వారా దోమల నిర్మూలన చేయవచ్చున్నారు. డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో డెం గ్యూ నివారణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డెంగ్యూ పరీక్ష నిర్ధారణలో ఆయుస్మాన్ భవ ఆరోగ్య కేంద్రాల వరకు డెంగ్యూ కిట్లను పం పిణీ చేశామన్నారు. దోమల నిర్మూలనను చేపడితే డెంగ్యూ నివారణ జ రుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్ కుమార్, శివప్ర తాప్, అమన్, వెంకటేశ్వర్లు, సునిత, రమ్య, సబ్ యూనిట్ అధికారి నాం దేవ్, జగదీశ్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, ఆశ , ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - May 16 , 2025 | 11:49 PM