అటవీ ప్రాంతంలో పర్యాటకుల సందడి
ABN, Publish Date - Jan 05 , 2025 | 10:45 PM
కవ్వాల టైగర్ జోన్‌లో బర్డ్‌వాచ్ పర్యాటకులను ఆకర్షించింది. ఆదివా రం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్డ్‌వాచ్‌కు 15 మంది పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి ఇందన్‌పల్లి రేంజ్‌లోని అటవీ ప్రాంతంలోని గన్‌శెట్టి కుంట వద్ద ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేశారు.
జన్నారం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): కవ్వాల టైగర్ జోన్‌లో బర్డ్‌వాచ్ పర్యాటకులను ఆకర్షించింది. ఆదివా రం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్డ్‌వాచ్‌కు 15 మంది పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి ఇందన్‌పల్లి రేంజ్‌లోని అటవీ ప్రాంతంలోని గన్‌శెట్టి కుంట వద్ద ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేశారు. రాత్రి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. గుడా రాల వద్ద బస చేయగా ఆదివారం ఉదయం బర్డ్ వాచ్‌ను ప్రారంభించారు. కరీంనగర్, నిజామాబాద్‌తో పాటు వరంగల్‌ల నుంచి వచ్చిన పర్యాటకులు బర్డ్ వాచ్‌లో పాల్గొన్నారు. పర్యాటకులు వారి లెన్స్ ద్వారా పక్షులను వీక్షిస్తూ సంబరపడ్డారు. అటవీ శాఖ అధికా రులు పక్షులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ఎఫ్‌ఆర్‌వోలు సుష్మారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చెన్నూరు/భీమారం, (ఆంధ్రజ్యోతి): చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలోని కిష్టంపేట, భీమారం మండలంలోని బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యం లో బర్డ్‌వాక్ కార్యక్రమం నిర్వహించారు. శనివారం సాయంత్రం కిష్టంపేటలోని అంబేద్కర్ ఈకో టూరిజం పార్కులో సందర్శకులు రిజిస్ర్టేషన్ చేసుకుని రాత్రి క్యాం ప్ ఫైర్ నిర్వహించారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు కిష్టంపేట అర్బన్ పార్కు నుంచి సఫారీ వాహనాల్లో బూరుగుపల్లి సమీపంలోని గొల్లవాగు ప్రాజె క్టు చేరుకుని బర్డ్ వాచింగ్‌లో పాల్గొన్నారు. పలు రకాల పక్షుల ను గుర్తించారు. సందర్శకులు తమ కెమెరాల్లో పక్షుల ఫొటోలను తీసుకున్నారు. ప్రాజెక్టు రిజర్వ్ అడ విలో ఉండడంతో నీటిలో ఉండే పక్షులు, వృక్షాలపైన ఉండే పక్షులను సుమారుగా 120 వరకు గుర్తించారు. అక్కడి నుంచి కిష్టంపేట అర్బర్ పార్కులో పలు రకాల పక్షులు, సీతాకోకచిలుకలు ఉన్నట్లు రీసోర్స్‌పర్సన్ రాం జాన్ విరాని గుర్తించారు. మంచిర్యాల రేంజ్ అధికారి రత్నాకర్, అటవీ రేంజ్ అధికారి శివకుమార్, డీఆర్‌వో ప్రభాకర్, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 10:45 PM