ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

ABN, Publish Date - May 26 , 2025 | 11:25 PM

కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాల ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సాధారణ ఎన్నికల పరిశీలకులు రియాజ్‌ హైమద్‌ అన్నా రు. సోమవారం సిర్పూర్‌(టి) మండల కేంద్రం లో మండల స్థాయి కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు.

మాట్లాడుతున్న రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ రియాజ్‌, పక్కన డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్‌

- రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రియాజ్‌ హైమద్‌

సిర్పూర్‌(టి), మే 26(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని, స్థానిక ఎన్నికల్లో గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాల ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, సాధారణ ఎన్నికల పరిశీలకులు రియాజ్‌ హైమద్‌ అన్నా రు. సోమవారం సిర్పూర్‌(టి) మండల కేంద్రం లో మండల స్థాయి కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు, మండలాల్లో కాంగ్రెస్‌ గెలుపునకు సైనికుల్లా పనిచేయాలన్నారు. రాను న్న సాధారణ ఎన్నికల్లో యువతకు ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తుందన్నారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో బస్టాండు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరు చేయిస్తానని అన్నారు. మండల, గ్రామ, బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశం లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు షకీల్‌ అహ్మద్‌, సిడాం గణపతి, సోహెల్‌ అహ్మద్‌, తులసీరాం, అబ్దుల్‌ అకీల్‌, రాజు, శంకర్‌, రవీం దర్‌, సత్యనారాయణ, ముంతగిర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా

దహెగాం (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టప డి పనిచేసే ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. సోమవారం దహెగాం మండలం ఇట్యాలలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ రియాజ్‌తో కలిసి మాట్లాడారు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం, ఎన్నికల ఎత్తుగడలు, రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకా లు ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషిచేయాలని సూచించారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, నా యకులు శ్రీరామరావు, సురేష్‌, నాగేష్‌గౌడ్‌, శ్రీనివాస్‌, భీమన్న, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:25 PM