ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారానికే భూ భారతి

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:34 PM

రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ తెలిపారు.

నీల్వాయిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, పక్కన కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, అధికారులు

- బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌

వేమనపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని నీల్వాయి రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుదంన్నారు. ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని సూచించారు. రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతీగ్రామంలో రైతులకు రెవెన్యూ అధికారులు ఈ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ భూ భారతి చట్టంలో పొందుపర్చిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ చట్టంలో అప్పీలు వ్యవస్ధ కూడా ఉందని, ఇది ఎంతో కీలకమైందన్నారు. ప్రతీ రైతు భూ భారతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్‌ కలిసి మండలంలోని 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ సంతోష్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సయ్యద్‌ సాబీర్‌అలీ, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:34 PM