బాధ్యులపై చర్యలు తప్పవు
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:19 PM
కూలీల మేలు కోసం చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎక్కడ తప్పిదా లు జరిగినా బాధ్యులపై చర్యలు తప్పవని డీఆర్డీవో దత్తారాం హెచ్చరించారు.
డీఆర్డీవో దత్తారాం
కౌటాల, జూన్ 4(ఆంధ్రజ్యోతి): కూలీల మేలు కోసం చేపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఎక్కడ తప్పిదా లు జరిగినా బాధ్యులపై చర్యలు తప్పవని డీఆర్డీవో దత్తారాం హెచ్చరించారు. బుధవారం కౌటా ల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి మధ్య కాలంలో జరిగిన రూ.7.5 కోట్ల పనులకు సంబంధించిన ఆడిట్ ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయ న్నారు. ఉపాధిహామీ పనులను సమర్థవంతం గా చేయాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. అదే సమయంలో రైతులు, ప్రజలు ఉపాధి హామీ కింద చేసే అభివృద్ధి పనులు చెరిపేయడం, తొలగించడం చేసేటప్పుడు ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. దీని వల్ల ఆడిట్ సమయంలో ఇబ్బందులు ఉండవన్నారు. ఉపాధి హామీ ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు రైతులకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తామని పేర్కొన్నారు. చిన్న చిన్న తప్పిదాలు మినహా ఈ ఆడిట్‌లో బయట పడకపోవడం మంచి విషయమని, చిన్నవాటిని సైతం మళ్లీ జరగకుండా చూడాల ని సూచించారు. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ బృందం ఎస్‌ఆర్పీ రవి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్, ప్లాంటేషన్ మేనేజర్ ఆంజనేయులు, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి రమేష్, ఎంపీడీఓ రమేష్, ఏపీఎం పూర్ణిమా, ఏపీఎం ముక్తేశ్వర్, ఈసీ సంతోష్, ఎంసీవో సాయి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:19 PM