ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దరఖాస్తులు స్వీకరించి.. భరోసా కల్పించి..

ABN, Publish Date - Aug 04 , 2025 | 11:27 PM

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు.

ప్రజావాణిలో అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే

ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌

దరఖాస్తులను త్వరగా పరిష్కారించాలని ఆదేశం

ఆసిఫాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పెండింగ్‌ లేకుండా త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన సదాశివ్‌ తనకు 65 సంవత్సరాల వయస్సు ఉన్నందు పెన్షన్‌ మంజూరుచేయాలని కోరారు. రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన రజిత తాము పులికుంట గ్రామ శివారు సాగు చేస్తున్న తమ భూమిలో పత్తి పంటను వేరే వ్యక్తి ధ్వంసం చేసినందులకు చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేశారు. ఆసిఫాబాద్‌ మండలం జన్కాపూర్‌కు చెందిన రాజేశ్వర్‌ తన పేరిట పట్టా అడ ప్రాజెక్టు నిర్మాణంలో పోయినందున నష్టపరిహారం చెల్లించాలని అర్జి సమర్పించారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని బజారు వాడికి చెందిన భాగ్యలక్ష్మి, రెబ్బెన మండం గోలేటి గ్రామానికి చెందిన సుగుణ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. వాంకిడి మండలం ఖమానాకు చెందిన రాధా బాయి ఖమానా నుంచి ఖమ్మర్‌గాం వెళ్లే దారిని గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమించుకున్నారని సమగ్ర విచారణ జరిపి ప్రజలకు న్యాయంచేయాలని దరఖాస్తు చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. జైనూరు మండలంలోని ట్రాన్స్‌జెండర్స్‌ తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అర్జి సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైద్య సిబ్బంది గ్రామాలను సందర్శించాలి

వర్షాకాలం అయినందున ప్రజా సంక్షేమంలో భాగంగా వైద్య సిబ్బంది గ్రామాలను, ఆశ్రమ పాఠశాలలను సందర్శించి ప్రజలు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ వేంకటేష్‌ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌లో గల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రిజిస్ట్రర్లను, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వర పీడితులను గుర్తించి వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించాలన్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం మండలంలోని బూర్గుడ గ్రామంలోని మండల పరిషత్‌ ప్రాథఽమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో అహర నాణ్యత, మోను, తరగతి గదులను పరిశీలించారు. ఐదో తరగతి గదిలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి పఠన సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 11:27 PM