రోగులపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
ABN, Publish Date - May 20 , 2025 | 11:30 PM
రోగులపై దురుసుగా ప్రవర్తిస్తే చ ర్యలు తప్పవని జిల్లా ఆ సుపత్రుల సమన్వయక ర్త డాక్టర్ రామకృష్ణ అన్నారు.
- జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ
ఉప్పునుంతల, మే 20 (ఆంధ్రజ్యోతి) : రోగులపై దురుసుగా ప్రవర్తిస్తే చ ర్యలు తప్పవని జిల్లా ఆ సుపత్రుల సమన్వయక ర్త డాక్టర్ రామకృష్ణ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సామాజిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. అనం తరం వైద్యసిబ్బందితో సమీక్షాసమావేశం నిర్వ హించారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది రో గుల పట్ల సంయమనంతో మెలగాలని అన్నా రు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్య క్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్వప్న, నర్సింగ్ ఆఫీసర్ ఉఫత్, నిర్మల, సందీప్, కుమారాచారి, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:30 PM