ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN, Publish Date - May 27 , 2025 | 11:14 PM

వేమనపల్లి మండలం చామ నపల్లి గ్రామంలో నిరుపేద రైతులకు పట్టా పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ వారి భూములు అటవీ శాఖ భూములని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఇది సరైంది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ పేర్కొన్నారు. సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులపై నీల్వాయి ఎస్‌ఐ శ్యామ్‌పటేల్‌కు ఫిర్యాదు చేశారు.

నీల్వాయి ఎస్‌ఐకి ఫిర్యాదు అందజేస్తున్న కొయ్యల ఏమాజీ

వేమనపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి) : వేమనపల్లి మండలం చామ నపల్లి గ్రామంలో నిరుపేద రైతులకు పట్టా పాస్‌బుక్‌లు ఉన్నప్పటికీ వారి భూములు అటవీ శాఖ భూములని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఇది సరైంది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ పేర్కొన్నారు. సోమవారం రాత్రి అటవీ శాఖ అధికారులపై నీల్వాయి ఎస్‌ఐ శ్యామ్‌పటేల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ చామనపల్లి గ్రామానికి చెందిన రైతులకు గత ప్రభుత్వాలు పట్టదారు పాసు పుస్తకాలు ఇచ్చినప్పటికీ ఆ భూములు అటవీ శాఖ భూములంటూ రైతులను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. 9 మంది దళిత రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. నిరుపేద దళిత రైతులను వేధిస్తున్న అటవీ శాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పేద రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఆధ్వర్వంలో న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. గతంలో భీమిని, కన్నెపల్లి,నెన్నెల మండలాల్లోని పోడు రైతుల పక్షాన పోరాటం చేసి అర్హులైన రైతులకు 200 ఎకరాల భూమిని ఇప్పించానని తెలిపారు. చామనపల్లి రైతుల కోసం పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మున్నారాజాసిసోడియా, దుర్గం ఎల్లయ్య, బానయ్య, లింగయ్య, పర్వతాలు, మధుకర్‌, సతీష్‌, రాజయ్య, మల్లయ్య , కృష్ణ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:14 PM