పేరుకుపోయిన సింగరేణి బకాయిలు...
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:57 PM
సింగరే ణికి ప్రభుత్వాలు బకాయి పడ్డ వేల కోట్ల రూపా యలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ ప్లాంట్లకు, ఇతర సంస్థలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేసిన బిల్లులు రూ. 40 వేల కోట్ల వరకు పెండింగులో ఉన్నాయి. తద్వారా సంస్థ ఆర్థిక కష్టాల్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
-ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో రూ. 40 వేల కోట్లు
-జెన్‌కో బిల్లులు చెల్లించడంలో తీవ్ర జాప్యం
-గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కుదేలైన సంస్థ
-కాంగ్రెస్ ప్రభుత్వానిదీ అదే దారి
-యంత్రాల కొనుగోళ్లకూ డబ్బులు కొరత
మంచిర్యాల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): సింగరే ణికి ప్రభుత్వాలు బకాయి పడ్డ వేల కోట్ల రూపా యలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ ప్లాంట్లకు, ఇతర సంస్థలకు బొగ్గు, విద్యుత్ సరఫరా చేసిన బిల్లులు రూ. 40 వేల కోట్ల వరకు పెండింగులో ఉన్నాయి. తద్వారా సంస్థ ఆర్థిక కష్టాల్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణిపై ఆధారిత పరిశ్రమలు ద క్షిణ భారతదేశంలో 4 వేల వరకు ఉంటాయి. ఆయా పరిశ్రమలకు కూడా సింగరేణి బొగ్గు, విద్యుత్‌ను వి నియోగించగా, ఆ సంస్థలు కూడా సింగరేణికి చె ల్లించాల్సిన డబ్బులు మొత్తం చెల్లించలేదని తెలు స్తోంది. కర్నాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా చేసిన డబ్బు సిం గరేణికి రావాల్సి ఉండగా, అది కూడా నిలిచి పోయినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ హయాం నుంచే....
సింగరేణి సంస్థకు చెందిన వేల కోట్ల రూపాయల సొమ్ము అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఖజానాకు మ ళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి సంవత్సరం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే టాక్స్‌లే కాకుండా అదనంగా సంస్థ సొమ్మును ప్రభుత్వం వాడుకుం టుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కరోనా సమయంలో రూ. 40 కోట్లు సీఎం సహాయ నిధికి అందజేయగా, డీఎంఎఫ్‌టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధులు రూ. 2740 కోట్లు, హరిత హారం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్సార్) నిధులు సమారు రూ. 263 కోట్లను సంస్థ ప్రభుత్వానికి దారాదత్తం చేసిన ట్లు సమాచారం. ఇవిగాక నాలుగేళ్లుగా సింగరేణి త యారు చేసిన విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వరంగ సం స్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కోలకు విక్రయిస్తోంది. వాటి బి ల్లులు వేల కోట్లలో పేరుకుపోయాయి. అలా బీఆర్ ఎస్ హయాంలోనే సింగరేణికి ప్రభుత్వం రూ. 27 వేల కోట్ల మేర బకాయిలు పడింది.
రూ. 40వేల కోట్లకు చేరుకున్న బకాయిలు...
ప్రభుత్వ నుంచి సుమారు రూ. 40వేల కోట్లు సిం గరేణికి రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్ హయాంలో బకా యిపడ్డ రూ. 27వేల కోట్లతోపాటు కాంగ్రెస్ హ యాంలోనూ మరో రూ. 13వేల కోట్ల మేర బకా యిలు పడ్డట్లు సమాచారం. ఎన్నికల సమయంలో సింగరేణి బకాయిలు చెల్లించడం ద్వారా సంస్థ అభి వృద్ధికి సహకరిస్తామన్న కాంగ్రెస్...అధికారంలోకి వ చ్చాక తనవంతు బకాయిలు కూడా జమ చేయక పోవడం గమనార్హం. ప్రభుత్వాల వద్ద వేల కోట్లు పెండింగులో ఉండటంతో సంస్థ బొగ్గు తవ్వకాల కోసం ఉపయోగించే భారీ వాహనాలైన షావల్, డో జర్, తదితర వాహనాలను కొనుగోలు చేయలేక ఓసీ ల్లో ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. కాం ట్రాక్టీకరణ వల్ల కూడా సంస్థపై ఆర్థిక భారం పడు తున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన తన హయాంలో బకాయిపడ్డ సొమ్ము చెల్లిస్తే సంస్థ అభివృద్ధికి తోడ్పాటునందించినట్లవు తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బకాయిలు వెంటనే చెల్లించాలి....
ఏఐటీయూసీ అధ్యక్షులు, వాసిరెడ్డి సీతారామయ్య
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ సుమా రు రూ. 40వేల కోట్లను వెంటనే చెల్లించాలి. ఏళ్ల త రబడి పెండింగ్‌లో ఉంచడం వల్ల సంస్థ అభివృద్దికి అడ్డంకిగా మారుతోంది. బొగ్గు తవ్వకాలు జరిపేం దుకు వినియోగించే భారీ వాహనాలు కొనుగోలు చే సేందుకు యాజమాన్యం పునరాలోచించాల్సిన పరి స్థితి ఉంది. గత ప్రభుత్వంలో దాదాపు రూ. 27 కోట్ల బకాయిలు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తూ రూ. 13వేల కోట్ల బకాయిలు పడింది.
Updated Date - Apr 24 , 2025 | 11:57 PM