కృష్ణానదిలో కొట్టుకుపోయిన యువకుడు
ABN, Publish Date - Aug 02 , 2025 | 11:32 PM
న లుగురు మిత్రులతో కలిసి వచ్చిన యువ కుడు ఎడమ పాతాళగంగలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కృష్ణానదిలోకి జారి పోవడంతో స్థానిక మత్సకారులు కాపాడిన సంఘటన శని వారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నది.
- కాపాడిన మత్స్యకారులు
బ్రహ్మగిరి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): న లుగురు మిత్రులతో కలిసి వచ్చిన యువ కుడు ఎడమ పాతాళగంగలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కృష్ణానదిలోకి జారి పోవడంతో స్థానిక మత్సకారులు కాపాడిన సంఘటన శని వారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎడమ పాతాళ గంగలో జరిగింది. మత్స్యకారులు తెలిపిన వివ రాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నలుగురు యువకులు శ్రీశైలం డ్యాం గేట్ల సందర్శనకు వచ్చారు. అనంతరం మల్లన్న దర్శనం చేసుకు నేందుకు ఎడమ పాతాళగంగ పుష్కర ఘాట్‌లో 25 సంవత్సరాల యువకుడు స్నానానికి దిగా డు. వేగంగా అలల తాకిడికి యువకుడు నీటి లోకి జారిపోయాడని మత్స్యకారులు లక్ష్మయ్య, గోపాల్, మల్లి పేర్కొన్నారు. నీటిలో కొట్టుకుపో తున్న యువకుడిని గమనించి తాము పుట్టిలో వెళ్లి రక్షించి ఒడ్డుకు చేర్చామన్నారు. కాగా, ఎడ మ పాతాళగంగ పుష్కర ఘాట్ వద్ద పోలీసుల భద్రత కొరవడిందని స్థానికులు ఆరోపి స్తున్నారు.
Updated Date - Aug 02 , 2025 | 11:32 PM