ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- రోశయ్యకు ఘన నివాళి

ABN, Publish Date - Jul 04 , 2025 | 11:15 PM

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దివంగత ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయన చిత్రపటాలకు అధికారులు, నాయకులు పూల మాలలు వేసి నివాళులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దివంగత ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయన చిత్రపటాలకు అధికారులు, నాయకులు పూల మాలలు వేసి నివాళులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పాల్గొన్నారు. అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, యాదవ, వైశ్య సంఘాల నాయకులు, అధికారులతో కలిసి దొడ్డి కొమురయ్య, రోశయ్యల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్పీ అభివృద్ధి అధికారి సజీవన్‌, గిరిజన సంక్షేమాధికారిణి రమాదేవి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, కలెక్టరేట్‌ ఏఓ కిరణ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న, యాదవ, వైశ్య సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో రోశయ్య జయంతిని పురస్కరించుకుని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాటా ్లడుతూ రోశయ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు సేవలందించారని అన్నారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పని చేశారని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచి ఇన్స్‌పెక్టర్‌ రాణా ప్రతాప్‌, ఆర్‌ఐ పెద్దన్న, డీపీవో ఏవో శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం మాజీ సీఎం రోశయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజనల్‌ మేనేజర్‌ శ్రావణి, విజిలెన్స్‌ ప్లాంటేషన్‌ మేనేజర్‌ లక్ష్మారెడ్డి, మంచిర్యాల రేంజ్‌ ప్లాంటేషన్‌ మేనేజర్‌ గోగుసురేష్‌ కుమార్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి ఏరియా గోలేటి జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఆవరణలో జీఎం విజయభాస్కర్‌ రెడ్డి రోశయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ టూ జీఎం కె.రాజమల్లు, డీజీఎం(ఐఈడీ) ఉజ్వ్‌ కుమార్‌ బెహార, ఏరియా సెక్యూరిటి అధికారి ఎన్‌.ఉమాకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 11:15 PM