ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నెరవేరనున్న క్రీడాకారుల కల

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:32 PM

జిల్లా కేంద్రం లో ఎప్పుడెప్పుడు స్టేడియం నిర్మాణానికి మోక్షం కలు గుతుందోనని దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న క్రీడాకా రులకు ఎట్టకేలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్న మైంది. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్ర త్యేక చొరవతో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మంచిర్యాలలో స్పోర్ట్స్‌ క్లబ్‌ ఏర్పాటు

కేంద్ర, రాష్ట్ర సహకారాలతో ఏర్పాటు

-రూ. 30 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం

-దశాబ్ధాల అనంతరం ఎట్టకేలకు మోక్షం

-12 ఎకరాల స్థలం కేటాయింపు

-త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు

మంచిర్యాల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లో ఎప్పుడెప్పుడు స్టేడియం నిర్మాణానికి మోక్షం కలు గుతుందోనని దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న క్రీడాకా రులకు ఎట్టకేలకు ఆ కల నెరవేరే సమయం ఆసన్న మైంది. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్ర త్యేక చొరవతో స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథా రిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ స్థలా న్ని పరిశీలించి స్టేడియం నిర్మాణానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో స్టేడియం నిర్మాణానికి మోక్షం కలుగ గా, త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికార యం త్రాంగం సన్నాహాలు చేస్తోంది.

ఏళ్లుగా ఎదురు చూపులే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మంచిర్యాలలో క్రీడ లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ సుమారు 3 వేల పైచిలుకు వివిధ రకాల క్రీడాకారులు ఉన్నారు. వారితోపాటు ఎన్‌సీసీ కెడేట్లు కూడా వందల సంఖ్యలో ఉంటారు. వీరందరికీ అనువైన క్రీడా స్థలంలో అందు బాటులో లేకపోవడంతో ఇన్నాళ్లుగా ఇబ్బందులు పడు తున్నారు. స్టేడియం అందుబాటులో లేని కారణంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచే అవకాశం క్రీడాకారు లకు ఉండేదికాదు. ఎన్‌సీసీ కెడేట్లు పరేడ్‌ కోసం సు మారు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబా ద్‌కు వెళ్లాల్సి వచ్చేది. 2016లో మంచిర్యాల జిల్లాగా ఆవిర్భంచినప్పటికీ స్టేడియం ఏర్పాటు మాత్రం కాలే దు. గతంలో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మించాలని తలపెట్టి నా...ఆ పనులు ముందుకు సాగలేదు. సదరు స్థలం పాఠశాలకు చెందినది కావడంతో పలువురి నుంచి అ భ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉన్న ఒక్కగానొక్క స్కూ ల్‌ గ్రౌండ్‌ను స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తే, సా యంత్రం వేళల్లో విద్యార్థులు ఆటలాడుకునేందుకు అ డ్డంకులు ఏర్పడతాయన్న ఉద్దేశ్యంతో పలు విద్యార్థి సంఘాల నేతలతోపాటు సామాజిక కార్యకర్తలు పలు వురు పనులను అడ్డుకున్నారు. దీంతో స్టేడియం నిర్మా ణం అర్థాంతరంగా రద్దు కాగా, సుమారు రూ. 2.5 కో ట్లు మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. అప్ప టి నుంచి పలు చోట్ల స్థల పరిశీలన జరిపినప్పటికీ కా ర్యరూపం దాల్చలేదు. రాళ్లవాగును ఆనుకొని పాత మంచిర్యాలలో 22 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఒక ద శలో స్టేడియం నిర్మాణానికి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అదికూడా ముందుకు సాగలేదు. దీంతో క్రీ డాకారుల ఆశలు నెరవేరలేదు. జిల్లాలోని కోల్‌బెల్ట్‌ ప్రాంతాలైన బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌లలో సింగరేణి ఆధ్వర్యంలో స్టేడియాలు నిర్మించినా, అవి పూర్తిస్థాయిలో క్రీడాకారులకు అందుబాటులో లేకపోవ డంతో తిరిగి ఎప్పటి పరిస్థితే పునరావృతం అవుతోంది. స్టేడియం నిర్మాణంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణం గా దశాబ్దాల కాలంగా స్థలం ఎంపికకు కూడా నోచుకోలేదు.

ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి మోక్షం....

కాగా దశాబ్దాల కాలం తరువాత ఎట్టకేలకు జిల్లా కేంద్రంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి మోక్షం కలి గింది. జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ప్రభుత్వం స్థలం సర్వే నెంబర్లు 662, 675లలో 12 ఎకరాల స్థలా న్ని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సూచనలతో స్పోర్ట్స్‌ అథా రిటీకి కేటాయిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో సుమారు రూ. 30 కోట్ల అంచనా వ్యయం తో మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు మా ర్గం సుగమం అయింది. అందులో వాలీబాల్‌, బాస్కె ట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌, జూడో, రెజ్లింగ్‌, టే బుల్‌ టెన్నిస్‌, తదితర క్రీడలు ఆడేందుకు ఇంటర్నేష నల్‌ స్టాండర్డ్స్‌తో రూ. 14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం ని ర్మాణం చేపట్టనున్నారు. అలాగే రూ. 9.5 కోట్లతో 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌, రూ. 6 కోట్లతో స్విమ్మింగ్‌ పూ ల్‌ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు త్వరలో డీపీఆర్‌ సిద్ధం చేస్తుండగా, వెంటనే పనులు చేపట్టనున్నారు. ఇండోర్‌ స్టేడియం అంచనా వ్యయంలో కొంత మొత్తం ఖేలో ఇండియా భరించనుండగా, మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కే టాయించనుంది. అలాగే ఇండోర్‌ స్టేడియం ఆవరణలో స్పోర్ట్స్‌ హాస్టల్‌ నిర్మాణం చేపట్టేందుకూ ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నారు. 150 మందికి వసతి కల్పించేలా ఏ ర్పాట్లు చేస్తుండగా...క్రీడాకారులకు అవసరమయ్యే శిక్ష ణ ఇచ్చే విధంగా సౌకర్యాలు కల్పించనున్నారు. మంచి ర్యాలలో న్యూఢిల్లీ- సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య ప్రధాన రైల్వే మార్గం అందుబాటులో ఉండటంతో స్పోర్ట్స్‌ మీ ట్‌ల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారు లు రాకపోకలు సాగించేందుకు అనుకూలంగా ఉంటుంది.

Updated Date - Jun 14 , 2025 | 11:32 PM