ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరుస చోరీలు చేసింది భార్యాభర్తలే

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:38 AM

యాదా ద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన వరుస దొంగతనాల మిస్టరీ వీడింది.

పోలీసులు అదుపులో దొంగలు

గతంలో వీరిపై పలు కేసులు

వీడిన ఇళ్లలో దొంగతనాల మిస్టరీ

భువనగిరి టౌన్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): యాదా ద్రిభువనగిరి జిల్లాకేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన వరుస దొంగతనాల మిస్టరీ వీడింది. వారం రోజుల వ్యవధిలో స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలను భువనగిరి పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పట్టణ శివారులో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్నది ఆ ఇద్దరేనని నిర్థారణ కావడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఎం. రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన బడ్డుల అనిల్‌, స్వాతి భార్యభర్తలు. వీరిద్దరూ సులభ సంపాదన కోసం దొంగలుగా మారారు. వీరిపై ఐదు పోలీస్‌స్టేషన్లలో పలు చోరీ కేసులు ఉన్నాయి. ఓ కేసులో అరెస్టు అయి 11 నెలల అనంతరం ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో భువనగిరి హెచ్‌బీ కాలనీలో 18వ తేదీ తెల్లవారుజామున రెండు ఇళ్లలో, 24వ తేదీ తెల్లవారుజామున అదే బస్తీలో అదే మాదిరిలో మరో రెండు ఇళ్లలో చోరీ చేసి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీలు, ఇతర ఆధారాలతో దర్యాప్తు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగలు పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Jul 28 , 2025 | 12:39 AM