దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:28 PM
జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- జిల్లాలో రాజశేఖర్‌రెడ్డి జయంతి నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు
నాగర్‌కర్నూల్ టౌన్/ అచ్చంపేటటౌన్/ కొల్లా పూర్/ ఉప్పునుంతల/ తాడూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ చిత్ర పటా నికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ అమలు చేసిన 108 ఆరోగ్యశ్రీ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వ్యవసాయానికి ఉచిత కరెం టు, రుణమాఫీ వంటి పథకా లను గుర్తు చేశారు. కార్యక్ర మంలో టీపీసీసీ సభ్యుడు కొలన్ వల్లభ్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటయ్య, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.
అచ్చంపేట పట్టణంలోని రాజీవ్ విగ్రహం వద్ద పాలశీతలీకరణ కేంద్రం అధ్యక్షుడు నర్సయ్య యాదవ్ ఆధ్వర్యంలో కాం గ్రెస్ నాయకులు వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
కొల్లాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.
ఉప్పునుంతలలో వైఎస్‌ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాలర్పించారు.
తాడూరులో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Updated Date - Jul 08 , 2025 | 11:28 PM