ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెర్వుగట్టుపై వైభవంగా మాస కల్యాణం

ABN, Publish Date - May 13 , 2025 | 12:12 AM

పౌర్ణమి తిథిని పురస్కరించుకుని నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం మాసకల్యాణం ఘనంగా నిర్వహించారు.

చెర్వుగట్టుపై మాస కల్యాణం చేస్తున్న అర్చకులు

చెర్వుగట్టుపై వైభవంగా మాస కల్యాణం

నార్కట్‌పల్లి, మే 12 (ఆంధ్రజ్యోతి): పౌర్ణమి తిథిని పురస్కరించుకుని నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం మాసకల్యాణం ఘనంగా నిర్వహించారు. మహామంటపంలో నిర్వహించిన ఈ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు సురే్‌షశర్మ, సతీ్‌షశర్మ వేదపండితుల మంత్రోచ్చారణలు, సన్నాయి వాయిద్యాల మధ్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకల్లో పలువురు దంపతులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

గోపలాయపల్లిలో: గోపలాయపల్లి వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో కూడా మాస కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయంలో యజ్ఞ మంటపం వద్ద నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యా రు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉత్సవంలో దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:12 AM