ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెండున్నర నెలల్లో 1,500 కేసుల పరిశీలన

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:03 AM

రెండున్నర నెలల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ 1,500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తె లిపారు.

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ షమీమ్‌ అక్తర్‌

నల్లగొండ టౌన్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): రెండున్నర నెలల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ 1,500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తె లిపారు. జిల్లాకేంద్రంలోని రోడ్లు, భవనాల అతిథి గృహం లో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మా ట్లాడారు. మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు వచ్చి న ఫిర్యాదులను మానవ హక్కుల కమిషన్‌ పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ 2025 ఏప్రిల్‌ 17వ తేదీన బాధ్యతలు తీసుకుంద ని, తనతో పాటు, మరో ఇద్దరు సభ్యులు కమిషన్‌లో ఉ న్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా లేదా రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తే వాటిని పరిశీలించి, పూర్తి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. విచారణ అనంతరం అవసరమైతే ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. పని చేయించుకున్న వారికి వేతనాలు చెల్లించకపోవడం, వారి హక్కులకు, స్వేచ్ఛకు, సమానత్వానికి ఆటంకం కలిగడం, ఇలాంటివన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయన్నారు. వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తామని తెలిపారు. కమిషన్‌ ఛార్జ్‌ తీసుకున్న సమయంలో 11,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రెండున్నర నెలల కాలంలో 1500 కేసులు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కొన్ని సుమోటో కేసులు సైతం తీసుకుంటామని, అలాగే బాధితుల తరఫున ఇచ్చే దరఖాస్తులను సైతం కమిషన్‌ స్వీకరిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్య తదితర సంస్థలను సందర్శించి సరైన విధంగా అమలవుతున్నది లేనిది పరిశీలిస్తామని తెలిపారు. మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హక్కుల కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరికి మంచి విద్య, వైద్యం, సమానత్వం అందాల్సిన బాధ్య త రాజ్యాంగ ప్రకారం ఉందని తెలిపారు.

Updated Date - Jul 02 , 2025 | 12:03 AM