ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sim Card Corner Cut: సిమ్ కార్డు కార్నర్‌లో చిన్న కట్.. ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే..

ABN, Publish Date - Sep 19 , 2025 | 01:59 PM

సిమ్ కార్డు డిజైన్ వెనకున్న కారణం తెలుసా. ఓ కార్నర్ కట్ చేసినట్టు సిమ్ కార్డు ఉండటానికి పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Sim card corner cut reason

ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ సిమ్ కార్డు గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అయితే, ఈ కార్డు డిజైన్‌కు సంబంధించి ఓ విషయంపై మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. సిమ్ కార్డుకు ఓ మూల చిన్న ముక్క కట్ చేసినట్టు ఎందుకు డిజైన్ చేశారనేది చాలా మందికి అంతుచిక్కని విషయం. అయితే, ఈ డిజైన్ వెనుక ఓ ముఖ్య కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Sim Card Corner Cut Reason).

నిపుణులు చెప్పే దాని ప్రకారం, సిమ్ కార్డును ఫోన్‌లో ఓ నిర్ణీత పద్ధతిలో అమర్చేందుకు అనువుగా ఈ డిజైన్‌ను ఎంచుకున్నారు. ఈ చిన్న కట్ వల్ల కార్డు ఫోన్‌లో ఎటూ కదలకుండా స్థిరంగా పెట్టొచ్చు. ఫోన్‌లో కార్డును పొరపాటు దిశలో పెట్టకుండా ఇలా డిజైన్ చేశారు (why sim has cut edge).

సిమ్ కార్డు పనితీరు ఇలా..

సబ్‌‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్‌ పదానికి సంక్షిప్త రూపమే సిమ్. మొబైల్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన యూజర్లకు ప్రత్యేక గుర్తింపుగా ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ నంబర్‌ను (ఐఎమ్ఎస్ఐ), దీనికి సంబంధించిన ఇతర కీలను సిమ్ కార్డులో నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా మొబైల్ నెటవర్క్‌కు అనుసంధానమైన ఉన్న మొబైల్ యూజర్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. యూజర్ ఓ నెటవర్క్‌కు కనెక్ట్ అవ్వొచ్చో లేదో ఈ నెంబర్ పైనే ఆధారపడి ఉంటుంది. యూజర్ అంతర్జాతీయ పర్యటనల్లో ఉన్నప్పుడు రోమింగ్ సర్వీసులు యాక్టివేట్ చేసుకునేందుకు ఈ నెంబర్ కీలకం. ఇక మల్టీ ఐఎమ్ఎస్ఐ సిమ్ కార్డుల్లో ఒకటికి మించి ఐఎమ్ఎస్ఐ ప్రొఫైల్స్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో, వివిధ నెట్వర్క్‌లను ఎంచుకునేటప్పుడు, ప్రయాణాల్లో ఉనప్పుడు ఫోన్ సేవలు పొందడం మరింత సులభం అవుతుంది.

ఇక ప్రతి మొబైల్‌ డివైజ్‌కు కేటాయించే ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఐఎమ్ఈఐ నెంబర్ అని అంటారు. ఇది ఐఎమ్ఎస్ఐ నెంబర్‌కు భిన్నమైనది. ఫోన్ పోయినప్పుడు లేదా ఎవరైనా తస్కరించినప్పుడు దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈ నెంబర్ ద్వారా డివైజ్‌ను బ్లాక్ చేయొచ్చు. అన్ని అనుమతులు ఉన్న డివైజ్‌లు మాత్రమే నెట్వర్క్‌కు అనుసంధానం చేసేందుకు నెట్వర్క్ ప్రొవైడర్లకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..

ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Read Latest and Technology News

Updated Date - Sep 19 , 2025 | 01:59 PM