ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

WhatsApp Unwanted Messages: త్వరలో కొత్త వాట్సాప్‌ ఫీచర్‌.. అపరిచితుల మెసేజ్‌ల నుంచి విముక్తి

ABN, Publish Date - Oct 20 , 2025 | 09:14 PM

అపరిచిత వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వచ్చే మెసేజీల తాకిడి నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మరి ఈ ఫీచర్ వివరాలేంటో తెలుసుకుందాం.

WhatsApp Privacy Update

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్‌ను వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే, అపరిచితులు ముఖ్యంగా బిజినెస్ వర్గాల నుంచి వచ్చే ప్రమోషనల్ మెసేజీలు చికాకు తెప్పిస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది (WhatsApp Unwanted Messages Blocking).

ఈ కొత్త ఫీచర్ ప్రకారం, తొలి మెసేజ్‌కు రిప్లై ఇవ్వని వ్యక్తులకు ఆ తరువాత పంపించే మెసేజీలపై పరిమితి విధిస్తారు. అంటే, అపరిచిత వ్యక్తులకు ఇకపై పదే పదే మెసేజ్‌లు పెట్టడం కుదరదన్న మాట. కాంటాక్ట్‌ లిస్టులో లేని వ్యక్తులకూ ఇది వర్తిస్తుంది. ఇందుకోసం నెలవారీ మెసేజీల కోటాను నిర్ణయించనున్నారు. రిప్లై రాని సందర్భాల్లో పంపే ప్రతి మెసేజీ ఈ కోటాకు చేరుతుంది. వాట్సాప్ ఎలర్ట్ కూడా పంపిస్తుంది. ఈ కోటా దాటితే మెసేజీలు పంపించే అవకాశాలు ఉండవు. మరి ఈ కోటాను ఎలా నిర్ణయిస్తారనే విషయంలో వాట్సాప్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ ఫీచర్‌ను ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పరీక్షిస్తున్నారు (WhatsApp privacy update).

సాధారణంగా ఫ్రెండ్స్ లేదా కాంటాక్ట్ లిస్టులోని వాళ్లతో చేసే చాట్స్‌పై ఈ కొత్త ఫీచర్ ప్రభావం ఉండదని కూడా వాట్సాప్ భరోసా ఇస్తోంది. కాంటాక్ట్స్‌లో లేని వ్యక్తులకు లేదా మెసేజీలు పంపినా రిప్లై ఇవ్వని వారికే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఒక్కసారి అవతలి వ్యక్తి రిప్లై ఇస్తే వాట్సాప్ ఆ చాట్‌ను యాక్టివ్‌గా పరిగణిస్తుంది. కోటాను తొలగిస్తుంది.

వాణిజ్య వర్గాలకు ఉపయోగ పడే బిజినెస్ మెసేజింగ్, గ్రూప్స్, కమ్యూనిటీస్ వంటి అనేక ఫీచర్లు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల అనవసర మెసేజీలు, ప్రమోషన్లు ఎక్కువయ్యాయన్న ఫిర్యాదులు కూడా పెరిగాయి. దీంతో, యూజర్ల సమస్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన వాట్సాప్ ఈ ఫీచర్‌ను టెస్టు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోంది: వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్

అమెజాన్ వెబ్ సర్వీసెస్ డౌన్.. పలు వెబ్‌సైట్స్ బంద్

Read Latest and Technology News

Updated Date - Oct 20 , 2025 | 09:20 PM