ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు సాహితీ శిఖరం సినారె

ABN, Publish Date - Jul 29 , 2025 | 11:13 PM

తెలుగు సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞను చాటిన డాక్టర్‌ సింగిరెడ్డి నారా యణరెడ్డి శిఖర సమానుడని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌కలందర్‌ కీర్తించారు.

  • ప్రిన్సిపాల్‌ షేక్‌ కలందర్‌ బాషా నివాళి

గద్వాలటౌన్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞను చాటిన డాక్టర్‌ సింగిరెడ్డి నారా యణరెడ్డి శిఖర సమానుడని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌కలందర్‌ కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ సినారె జయంతిని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళా శాల దివంగత కవి చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ప్రిన్సిపాల్‌ తెలుగు సాహిత్యం విభి న్న కోణాలను సృశించిన సినారే తాను రచించి న ‘విశ్వంభర’ కావ్యానికి ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు దక్కించుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఇలాంటి మహనీయులు జీవిత చరిత్రలను విద్యార్థులు అధ్యయనం చే యాలని సూచించారు. కార్యక్రమంలో మాట్లా డిన తెలుగు విభాగం హెచ్‌వోడీ మేడిచర్ల హరి నాగభూషణం, పద్యాలు, నాటకాలు, అనువా దం, వచన కవిత్వం, గజల్స్‌ వంటి ప్రక్రియలో రచనలు చేయడంతో పాటు సినీ గేయరచయి త, నటుడిగా ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం దక్కించుకున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌గా తెలు గు భాష అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవ లు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్రర్‌ సత్య న్న, శంకర్‌, వెంకటేశ్వర్లు, మల్లికార్జున్‌, బోధనేతర సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:13 PM