ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ChatGPT-5: చాట్‌జీపీటీ-5పై విమర్శలు.. అది పెద్ద తప్పేనన్న సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్

ABN, Publish Date - Aug 15 , 2025 | 07:46 PM

చాట్‌జీపీటీ-5 లాంచ్ సమయంలో పాత మోడల్స్‌ను పూర్తిగా తొలగించడం పెద్ద తప్పేనని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. ఈ ఉదంతం తరువాత తాము గుణపాఠం నేర్చుకున్నామని కూడా చెప్పారు.

Sam Altman GPT-5 Rollout Apology

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ-5 విడుదల సందర్భంగా కొన్ని పెద్ద తప్పులే జరిగాయని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అంగీకరించారు. పాత చాట్‌జీపీటీ మోడల్స్‌ అన్నిటినీ తొలగించడం యూజర్లకు ఏమాత్రం నచ్చక నెట్టింట విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. పైపెచ్చు, చాట్‌జీపీటీ-5తో సంభాషణలు కూడా ముక్తసరిగా ఉన్నాయన్న భావన కలగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది తమ సబ్‌స్క్రిప్షన్ బంద్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే చేసిన తప్పును సరిదిద్దిన ఓపెన్ ఏఐ.. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు పాత మోడల్స్‌లో కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది.

ఈ పరిణామాలపై తాజాగా శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. ఈ విషయంలో తాము చాలా పెద్ద తప్పు చేశామని అన్నారు. తగిన గుణపాఠం కూడా నేర్చుకున్నామని అన్నారు. యూజర్లకు కొత్త మోడల్ అందించాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, కస్టమర్లకు చాట్‌జీపీటీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు. మునుపటి ఏఐ మోడల్స్‌తో కస్టమర్లకు ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని కూడా కామెంట్ చేశారు.

చాట్‌జీపీటీ-5 లాంచ్ తరువాత ఏపీఐ ట్రాఫిక్‌ కేవలం 48 గంటల్లోనే రెండింతలయ్యిందని అన్నారు. చాట్‌జీపీటీ యాప్ వినియోగదారులు కూడా జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పాత మోడల్స్ అన్నిటినీ తొలగించి కొత్త మోడల్ తీసుకురావడం పెద్ద తప్పిదమేనని అంగీకరించారు.

గతంలో చాట్‌జీపీటీ కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చినప్పుడు కస్టమర్లు ఉత్సాహంగా స్పందించారు. జిబిలీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ ప్రపంచవ్యాప్తంగా జనాలను ఆకట్టుకుంది. ఒక్కసారిగా జనాల్లో చాట్‌జీపీటీ వినియోగం పెరిగింది. అయితే, చాట్‌జీపీటీ-5 విషయంలో మాత్రం ఆ స్థాయి ఉత్సుకత కానరాలేదు. పైపెచ్చు అనేక మంది యూజర్లు కొత్త మోడల్‌పై విమర్శలు గుప్పించారు. దీని పనితీరు నిరుత్సాహంగా ఉందన్నారు. తమ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకుంటామని కూడా కొందరు బెదిరించారు. పాత మోడల్స్‌ను తొలగించడం అనేక మందిని తీవ్రంగా నిరాశపరిచింది. జనాల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న ఓపెన్ ఏఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. చాట్‌జీపీటీ-4o మోడల్‌ను పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి తేవడంతో పాటు నచ్చిన ఏఐ మోడల్‌ను ఎంచుకునేందుకు మోడల్ పికర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఇవి కూడా చదవండి:

చాట్‌జీపీటీ-5ని ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. దీని ఫీచర్స్ ఏంటంటే..

చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్

Read Latest and Technology News

Updated Date - Aug 15 , 2025 | 07:55 PM