ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EPFO 3.0: ఖాతాదారులకు శుభవార్త.. జెట్ స్పీడులో క్లైం డబ్బులు ఖాతాలోకి..

ABN, Publish Date - Jun 01 , 2025 | 09:44 PM

EPFO 3.0: ఈపీఎఫ్ఓ 3.0 సేవలు జూన్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ సేవల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.

EPFO 3.0

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అడుగులు వేస్తోంది. ఈపీఎఫ్ఓ 3.0ను అమల్లోకి తీసుకురానుంది. ఈపీఎఫ్ఓ 3.0 సేవలు జూన్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ సేవల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. ఏటీఎమ్ విత్‌డ్రాల్స్, ఆటో క్లైమ్ సెటిల్‌మెంట్, ఓటీపీ బేస్డ్ అకౌంట్ అప్‌డేట్స్ అందుబాటులోకి తీసుకురానుంది.


ఏటీఎమ్ విత్ డ్రా

ఈపీఎఫ్ఓ సంస్థ మొదటి సారి ఇలాంటి సేవను అందుబాటులోకి తేనుంది. ఈ సేవలో భాగంగా ఖాతాదారులు ఈపీఎఫ్ డబ్బుల్ని ఏటీఎమ్ ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. క్లైమ్ సెటిల్‌మెంట్ అయిపోయిన వెంటనే డబ్బుల్ని డైరెక్ట్‌గా ఏటీఎమ్ నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.

ఆటోమేటెడ్ క్లైమ్ సెటిల్‌మెంట్

3.0లో ఈ సేవ అందుబాటులోకి రానుంది. ఆటోమేటెడ్ క్లైమ్ సెటిల్‌మెంట్ ద్వారా ప్రాసెసింగ్ సమయం, మనుషుల జోక్యం గణనీయంగా తగ్గనుంది. డబ్బులు వేగవంతంగా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్లో పడనున్నాయి.


డిజిటల్ అకౌంట్ కరెక్షన్

డిజిటల్ అకౌంట్ కరెక్షన్ ద్వారా ఖాతాదారులు తమ వ్యక్తిగత వివరాలను.. అంటే.. పేరు, పుట్టిన రోజులతో పాటు ఇతర వివరాలను ఆన్‌లైన్ ద్వారానే సరిచేసుకోవచ్చు. ఇకపై ఫామ్ నింపి సబ్‌మిట్ చేయాల్సిన అవసరం లేదు.

గ్రీవియెన్స్ రెడ్రెసల్

ఈపీఎఫ్ఓ సంస్థ గ్రీవియెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌ను అప్డేట్ చేసే పనిలో పడింది. 3.0 ద్వారా ఖాతాదారుల సమస్యలను అత్యంత వేగంగా పరిష్కరించనుంది.

సోషల్ సెక్యూరిటీ ఇంటిగ్రేషన్, హెల్త్ కేర్ ఎక్స్‌పాన్షన్

అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈపీఎఫ్ఓకు అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 01 , 2025 | 09:46 PM