ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Charger: చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా

ABN, Publish Date - Jun 05 , 2025 | 06:07 PM

ఫోన్‌ను చార్జింగ్ చేసుకున్నాక చార్జర్‌ను స్విచ్ బోర్డులోనే వదిలేస్తున్నారా. ఇది చాలా రిస్క్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం గురించి తాజా కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Charger standby power waste

ఇంటర్నెట్ డెస్క్: గ్యాడ్జెట్స్‌‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటితో పాటు చార్జర్‌లు కూడా అదే స్థాయిలో ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ప్రతి ఇంట్లో కనీసం నాలుగైదు చార్జర్లు దర్శనమిస్తుంటాయి. అయితే, చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌‌ను చార్జింగ్ చేసుకున్నాక చార్జర్‌ను స్విచ్ బోర్డులోనే వదిలేస్తారు. స్విచ్ ఆఫ్ చేసినా కూడా చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే పెట్టి ఉంచడం రిస్క్ అని నిపుణులు చెబుతున్నారు.

చార్జర్ అవసరం ఎందుకంటే..

సాధారణంగా మనం వినియోగించే కరెంట్ రెండు రూపాల్లో ఉంటుంది. ఇళ్లకు ఏసీ కరెంట్ సప్లయ్ అవుతుంది. కానీ ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్స్‌, వాటిలోని బ్యాటరీలు డీసీ కరెంట్ ఆధారంగా పని చేస్తాయి. చార్జర్‌.. ఏసీ కరెంట్‌ను డీసీ కరెంట్‌గా మారుస్తుంది. ఎలక్ట్రిక్ ఉపకరణాలన్నిటిలో ఏసీని డీసీగా మార్చే కన్వర్టర్ తప్పకుండా ఉంటుంది.


ఇక చార్జింగ్‌కు వినియోగించని సందర్భాల్లో కూడా చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే పెట్టి వదిలేస్తే స్వల్పంగా విద్యుత్ వినియోగం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. చార్జర్‌లోని సర్క్యూట్‌లను రన్నింగ్‌లో ఉంచేందుకు వినియోగం అవుతుంది. మిగితాది వేడి రూపంలో వృథా అవుతుంది. కాబట్టి, ఇంట్లో పలు చోట్ల స్విచ్ బోర్డుల్లో చార్జర్‌లను అలాగే వదిలేస్తే విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఆధునిక చార్జర్‌లలో ఈ వృథాను వీలైనంతగా పరిమితం చేసేందుకు అనేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ చార్జర్‌ను స్విచ్ బోర్డుల్లో పెట్టి ఉంచకపోవడమే మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా, ఇలాంటి అలవాటు వల్ల చార్జర్లు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. నాణ్యత తక్కువగా ఉన్న చార్జర్‌లతో అగ్ని ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి, చార్జింగ్ సమయంలో చార్జర్ బాగా వేడెక్కుతున్నా, శబ్దం వస్తున్నా వెంటనే దాన్ని వదిలించుకుని కొత్తది తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పని అయిపోగానే చార్జర్‌ను స్విచ్ బోర్డు నుంచి తీసేయాలి. ఇంట్లో లేని సందర్భాల్లో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్

విదేశీ మహిళ ముందు పరువు పోగొట్టుకున్న భారతీయ పురుషులు.. వైరల్ వీడియో

Read Latest and Technology News

Updated Date - Jun 05 , 2025 | 06:16 PM