ChatGPT-5: చాట్‌జీపీటీ-5ని ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. దీని ఫీచర్స్ ఏంటంటే..
ABN, Publish Date - Aug 08 , 2025 | 12:04 PM
ఓపెన్ ఏఐ సంస్థ లేటెస్ట్ చాట్‌జీపీటీ-5 మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో తాజా మోడల్ ఫీచర్స్ ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా చాట్‌జీపీటీ-5 మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న చాట్‌జీపీటీ-4o, చాట్‌జీపీటీ--4.5 మోడల్స్ స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. ఫ్రీ యూజర్లకు చాట్‌జీపీటీ-5 వినియోగంపై కొన్ని పరిమితులు విధించగా ప్రో వర్షెన్ సబ్‌స్క్రైబర్లకు మరింత శక్తిమంతమైన చాట్‌జీపీటీ-5 ప్రోను అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ తాజా మోడల్ ఫీచర్స్ ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మునుపటి మోడల్స్‌ను సమ్మిళితం చేసి కొత్త స్మార్ట్ సిస్టమ్‌గా చాట్‌జీపీటీ-5ని సిద్ధం చేసినట్టు ఓపెన్ ఏఐ పేర్కొంది.
యూజర్ల ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇవ్వాలా లేక మరింత లోతైన విశ్లేషణ తరువాత స్పందించాలా అన్న అంశాన్ని చాట్‌జీపీటీ తనంతట తానుగా నిర్ధారించుకునేందుకు రియల్ టైమ్ రౌటర్ వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంది.
ఇక యూజర్.. చాట్‌జీపీటీ-5 వాడుక పరిమితి దాటితే తనంతట తానుగా మినీ వర్షన్‌కు మారిపోతుంది.
చాట్‌జీపీటీ-4o తో పోలిస్తే చాట్‌జీపీటీ-5లో తప్పులు దొర్లే అవకాశాలు 45 శాతం తక్కువని ఓపెన్ ఏఐ పేర్కొంది.
యూజర్ల ప్రతి వాదనతో ఏకీభవించి వారి మెప్పును పొందే ప్రయత్నాలను ఈ తాజా వర్షన్ చేయదని సంస్థ చెబుతోంది.
మునుపటి మోడల్స్‌తో పోలిస్తే చాట్‌జీపీటీ-5లో కోడింగ్ సామర్థ్యాలు అధికమని ఓపెన్ ఏఐ సంస్థ పేర్కొంది.
వ్యాసాలు, ఇంతర సంక్లిష్ట సాహిత్య అంశాల్లో చాట్‌జీపీటీ-5 మునుపటి మోడల్స్‌తో పోలిస్తే మరింత మెరుగైన సూచనలు సలహాలు ఇస్తుంది.
వైద్య సంబంధిత అంశాల్లో కూడా సందర్భాన్ని అనుసరించి యూజర్లకు అవగాహన పెంచేందుకు చాట్‌జీపీటీ-5 ప్రయత్నిస్తుంది.
రిస్కీ విషయాల్లో మరింత జాగ్రత్తగా స్పందించేలా చాట్‌జీపీటీ-5ని తీర్చిదిద్దినట్టు ఓపెన్ ఏఐ పేర్కొంది. జీవ, రాసాయనిక అంశాల్లో మరిన్ని కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఇక సైన్స్, మ్యాథ్స్, ఆరోగ్యం, కోడింగ్ వంటి విషయాల్లో మరింత మెరుగ్గా వ్యవహరించే చాట్‌జీపీటీ-5 ప్రో వర్షెన్ పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సంక్లిష్ట అంశాల్లో 68 శాతం మంది ప్రొఫెషనల్స్ ప్రో వర్షెన్‌నే ఎంచుకుంటున్నారని ఓపెన్ ఏఐ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరూ ఓసారి చాట్‌జీపీటీ-5ని ట్రై చేసి చూడండి.
ఇవి కూడా చదవండి:
చాట్‌జీపీటీలో స్టడీ మోడ్ ఫీచర్.. స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్
చాట్‌జీపీటీతో పంచుకునే వ్యక్తిగత వివరాల గోప్యతపై గ్యారెంటీ లేదు.. శామ్‌ఆల్ట్‌మన్ స్పష్టీకరణ
Read Latest and Technology News
Updated Date - Aug 08 , 2025 | 12:15 PM