Fancy Vehicle Number: 9999 @ 25.50 లక్షలు!
ABN, Publish Date - Sep 13 , 2025 | 05:48 AM
ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయానికి సంబంధించిన ఆన్‌లైన్ వేలంలో..
ఆన్‌లైన్ వేలంలో దక్కించుకున్న హెటెరో డ్రగ్స్ లిమిటెడ్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయానికి సంబంధించిన ఆన్‌లైన్ వేలంలో టీజీ09 జీ 9999 నెంబరు రికార్డు స్థాయిలో రూ.25,50,200 పలికింది. హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ ఇటీవల కొనుగోలు చేసిన ఓ వాహనం కోసం ఈ నెంబరును తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ చిదుర పేర్కొన్నారు. టీజీ09 హెచ్ 0009 నెంబరును రూ.6,50,009కు ఏఆర్‌ఎల్ టైర్స్ లిమిటెడ్, టీజీ09 హెచ్ 0001 నెంబరును రూ.6,25,999కి డాక్టర్ రాజేశ్వరీస్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, టీజీ09 హెచ్ 0006 నెంబరును ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ రూ.5,11,666కు దక్కించుకున్నాయి. టీజీ09 హెచ్ 0005 నెంబరును శృంగవరపు వెంకటేశ్వరరావు రూ.2.22 లక్షలకు, టీజీ09 హెచ్ 0007ను పోచ విజయ రూ.1,51,999కు వేలంలో కొనుగోలు చేశారు. టీజీ09 హెచ్ 0099 నెంబరు రూ.1,30,999, టీజీ09 జీ 9990 నెంబరు రూ.1.22 లక్షలు, టీజీ09 హెచ్ 0027 నెంబరు రూ.1,04,999, టీజీ09 హెచ్ 0234 రూ.1,01,234కు దక్కించుకున్నారు. టీజీ09 సిరీ్‌సలోని ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో సంస్థకు రూ.63,77,361 ఆదాయం వచ్చిందని రమేష్ తెలిపారు.
Updated Date - Sep 13 , 2025 | 05:48 AM