ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ChatGPT Alternatives: చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంతో ఇక్కట్లు.. ఈ ఏఐ చాట్‌బాట్స్‌తో పరిష్కారం

ABN, Publish Date - Jun 10 , 2025 | 09:53 PM

చాట్‌జీపీటీ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారా? ఈ ప్రత్యామ్నాయాలపై కూడా ఓ లుక్కేయండి.

ChatGPT Alternatives

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ వినియోగంలో భారత్‌ టాప్‌లో ఉంది. దీంతో, ఈ సేవలకు ఏ చిన్న అంతరాయం కలిగినా అనేక మందికి ఇబ్బంది తప్పదు. చాట్‌జీపీటీ తప్ప ఇతర చాట్‌బాట్లపై అంతగా అవగాహన లేనివారికి ఇది మరింత ఇబ్బందికరం. కాబట్టి ఈ చాట్‌బాట్‌కు సమానమైనవి ఏవో తెలుసుకుని పెట్టుకుంటే అత్యవసర సందర్భాల్లో అక్కరకు వస్తాయి.

గూగుల్ యాప్స్ అన్నిటితో అనుసంధానమైన గూగుల్ జెమనీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యూజర్‌ల ఫోన్‌లలోని యాప్స్‌తో కూడా జెమినీ అనుసంధానమై ఉంటుంది. గూగుల్ డాక్స్, జీమెయిల్‌ను సమాచారాన్ని రిట్రీవ్ చేసి యూజర్లకు కావాల్సిన సాయం చేస్తుంది జెమినీ

ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఐ రూపొందించిన గ్రోక్.. ఇతర సంప్రదాయక చాట్‌బాట్‌లతో పోలిస్తే భిన్నమైనది. వెబ్‌తో పాటు ట్విట్టర్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇది పనులు చేసిపెట్టగలదు. ట్విట్టర్‌లోని సమాచారంతో సులువుగా ఇంటరాక్ట్ కాగలదు.

మైక్రోసాఫ్ట్ రూపొందించిన కోపైలట్ పేరుకు తగ్గట్టుగానే యూజర్ల వెన్నంటే ఉంటూ కావాల్సిన సహాయం అందిస్తుంది. చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఎడ్జ్ బ్రౌజర్‌లో ఇది అందుబాటులో ఉంది. యూజర్ ప్రస్తుతం చూస్తున్న వెబ్‌పేజీకి సంబంధించిన సమాచారం అంతా చిటికెలో తెచ్చివ్వగలదు.

ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ కోడింగ్‌లో సాయం చేయగలదు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ జరిపిన పోటీలో ఈ చాట్‌బాట్ టాప్‌లో నిలిచింది. హాల్యూసినేషన్స్ బారిన పడని ఒకే ఒక చాట్‌బాట్‌గా నిలిచింది. సహజసిద్ధమైన చాట్స్‌కు ఇది పెట్టింది పేరు.

సాధారణ సెర్చ్ ఇంజెన్లకు ప్రత్యా్మ్నాయంగా పర్‌ప్లెక్సిటీకి పేరుంది. నెట్టింట అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా ఇది కచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో దిట్ట. వీటితో రీసెర్చ పేపర్లు, వెబ్‌సైట్స్, రెడిట్ వంటి వేదికలను జల్లెడపట్టి కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్

చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా

Read Latest and Technology News

Updated Date - Jun 10 , 2025 | 09:53 PM