Albania Appoints Worlds First AI Minister: అల్బేనియాలో ఏఐ మంత్రి
ABN, Publish Date - Sep 13 , 2025 | 03:57 AM
ఐరోపా దేశమైన అల్బేనియా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది...
ప్రపంచంలోనే తొలిసారిగా..!
తిరానా, సెప్టెంబర్ 12: ఐరోపా దేశమైన అల్బేనియా ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక మహిళా మంత్రిని నియమించింది. ఆ దేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఈ ఏఐ మంత్రికి డి యెల్లా అని పేరు కూడా పెట్టారు. అల్బేనియాలో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశ ప్రధాని ఏడీ రామా ప్రకటించారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విభాగంలో అవినీతి సమస్య అల్బేనియా ప్రభుత్వాన్ని చాలా ఏళ్లుగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్‌లో చేరాలన్న అల్బేనియా కలను నెరవేర్చుకోవడానికి అవినీతి నిర్మూలన కీలకంగా మారిందని ప్రధాని రామా అభిప్రాయపడ్డారు. పబ్లిక్ టెండర్లకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగకుండా డియెల్లా నిఘా పెట్టనుందని, ప్రభుత్వ నిధులు పారదర్శకంగా కేటాయింపులు జరిగేలా పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
Updated Date - Sep 13 , 2025 | 03:57 AM