Yashasvi Jaiswal: గోవాకు కాదు ముంబైకే ఆడతా
ABN, Publish Date - May 10 , 2025 | 05:05 AM
యశస్వీ జైస్వాల్ తన గత నెలలో తీసుకున్న గోవాకు ఆడే నిర్ణయాన్ని మార్చుకుని ముంబై క్రికెట్ జట్టులో ఆడాలని ప్రకటించాడు. గోవా క్రికెట్ సంఘానికి ఎన్‌ఓసీ పంపేందుకు ముందుగా రాసిన లేఖను కూడా వెనక్కి తీసుకున్నాడు.
జైస్వాల్ యూటర్న్
ముంబై: యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇక గోవాకు ఆడబోతున్నట్టు గత నెలలో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతలోనే ఏమైందో కానీ తిరిగి పాత జట్టు ముంబై తరఫున బరిలోకి దిగాలనుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. అంతేకాకుండా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) కోసం రాసిన లేఖను కూడా వెనక్కి తీసుకున్నాడు. ‘వచ్చే దేశవాళీ సీజన్‌లో గోవాకు ఆడాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. అందుకే ఇక నుంచి నన్ను ముంబై క్రికెటర్‌గానే పరిగణించాలని ఎంసీఏను కోరుతున్నా. ఇప్పటివరకైతే బీసీసీఐకి, గోవా క్రికెట్ సంఘానికి గానీ ఎన్‌ఓసీని సమర్పించలేదు’ అని జైస్వాల్ పేర్కొన్నాడు. గత సీజన్‌లో ముంబై కెప్టెన్ రహానెతో విభేదాల నేపథ్యంలో జైస్వాల్ జట్టు మారాలని భావించినట్టు కథనాలు వచ్చాయి.
Updated Date - May 10 , 2025 | 05:07 AM