Wimbledon Final: సినర్ కొత్త చరిత్ర
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:13 AM
డబుల్ డిఫెండింగ్ చాంప్ కార్లోస్ అల్కారజ్‌ను ఓడించిన టాప్ సీడ్ యానిక్ సినర్.. తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో...
వింబుల్డన్ నెగ్గిన తొలి ఇటాలియన్
ఫైనల్లో అల్కారజ్ జోరుకు బ్రేక్
లండన్: డబుల్ డిఫెండింగ్ చాంప్ కార్లోస్ అల్కారజ్‌ను ఓడించిన టాప్ సీడ్ యానిక్ సినర్.. తొలిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సినర్ 4-6, 6-4, 6-4, 6-4తో రెండో సీడ్ అల్కారజ్ (స్పెయిన్)పై సునాయాసంగా నెగ్గాడు. దీంతో హ్యాట్రిక్ టైటిల్ నెగ్గాలన్న అల్కారజ్ స్వప్నం చెదరగా.. 148 ఏళ్ల టోర్నీ చరిత్రలో టైటిల్ నెగ్గిన తొలి ఇటాలియన్‌గా సినర్ రికార్డు సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కారజ్ చేతిలో ఓడిన సినర్.. గ్రాస్ కోర్ట్‌లో గట్టిగా బదులు తీర్చుకొన్నాడు. మూడు గంటలకుపైగా సాగిన పోరులో అల్కారజ్ తొలి సెట్‌లో నెగ్గినా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచిన సినర్ టైటిల్‌ను దక్కించుకొన్నాడు. మొదటి సెట్ ఐదో గేమ్‌లోనే అల్కారజ్ సర్వీ్‌సని బ్రేక్ చేసిన సినర్ 4-2తో ముందంజ వేశాడు. అయితే, ఎనిమిదో గేమ్‌లో బ్రేక్ పాయింట్ సాధించిన అల్కారజ్ 4-4తో సమం చేశాడు. ఇదే జోరులో వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. అయితే, రెండో సెట్‌లో పుంజుకొన్న సినర్ 2-0తో పైచేయి సాధించాడు. మరోవైపు పట్టువదలకుండా పోరాడిన అల్కారజ్ 4-5తో నిలిచాడు. కానీ, చివరి గేమ్‌లో సర్వీ్‌సను నిలబెట్టుకొన్న సినర్..సెట్ నెగ్గి1-1తో స్కోరు సమం చేశాడు.
ఇక్కడి నుంచి కార్లోస్ ఆట గతితప్పింది. మూడో సెట్‌లో ఇద్దరూ తమతమ సర్వీ్‌సలను నిలబెట్టుకొంటూ సాగడంతో 4-4తో సమంగా నిలిచారు. అయితే, 9వ గేమ్‌లో అల్కారజ్ సర్వీ్‌సను బ్రేక్ చేసిన సినర్ 6-4తో మూడో సెట్ గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఇక, నాలుగో సెట్ మూడో గేమ్‌లోనే బ్రేక్ పాయింట్ సాధించిన సినర్ 2-1తో పైచేయిగా నిలిచాడు. కానీ, 8వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసే అవకాశాన్ని అల్కారజ్ చేజార్చుకోవడంతో.. సినర్ 5-3తో టైటిల్‌కు చేరువయ్యాడు. 10వ గేమ్‌లో తన సర్వీ్‌సను నిలబెట్టుకొన్న యానిక్ విజేతగా నిలిచాడు. దీంతో వరుసగా 24 మ్యాచ్‌లు గెలిచిన అల్కారజ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 14 , 2025 | 04:13 AM