తొలిరోజే 14 వికెట్లు
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:22 AM
పేసర్ల ఆధిపత్యం సాగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలాయి. వెబ్‌స్టర్ (72), స్మిత్ (66) అర్ధ శతకాలతోపాటు బౌలర్లు రాణిస్తుండడంతో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది...
విజృంభించిన పేసర్లు
ఆస్ట్రేలియా 212 ఆలౌట్
స్మిత్, వెబ్‌స్టర్ అర్ధ శతకాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 43/4
లండన్: పేసర్ల ఆధిపత్యం సాగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలాయి. వెబ్‌స్టర్ (72), స్మిత్ (66) అర్ధ శతకాలతోపాటు బౌలర్లు రాణిస్తుండడంతో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. రబాడ (5/51) నిప్పులు చెరగడంతో.. బుధవారం ఆరంభమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ ఖవాజా (0)ను డకౌట్ చేసిన రబాడ.. వన్‌డౌన్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ (4)ను కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన లబుషేన్ (17)ను జాన్సెన్ బోల్తా కొట్టించడంతో ఆసీస్ 46/3తో నిలిచింది. హెడ్ (11) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక పోయాడు. ఈ దశలో జతకలసిన స్మిత్, వెబ్‌స్టర్ ఐదో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న స్మిత్‌ను మార్‌క్రమ్ అవుట్ చేయడంతో టీ విరామానికి ఆస్ట్రేలియా 190/5తో నిలిచింది. ఆఖరి సెషన్‌లో క్యారీ (23)ను కేశవ్, హాఫ్ సెంచరీ సాధించిన వెబ్‌స్టర్‌ను రబాడ వెనక్కిపంపారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 43/4తో కష్టాల్లో పడింది. మొదటి రోజు ఆట ఆఖరుకు బవుమా (3 బ్యాటింగ్), డేవిడ్ బెడింగమ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు మార్‌క్రమ్ (0), రికెల్టన్ (16)ను స్టార్క్ వెనక్కిపంపాడు. ముల్డర్ (6)ను కమిన్స్ పెవిలియన్ చేర్చగా.. స్టబ్స్ (2)ను హాజెల్‌వుడ్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు సౌతాఫ్రికా ఇంకా 169 పరుగుల దూరంలో ఉంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 212 ఆలౌట్ (వెబ్‌స్టర్ 72, స్మిత్ 66; రబాడ 5/51, జాన్సెన్ 3/49).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 43/4 (రికెల్టన్ 16; స్టార్క్ 2/10, కమిన్స్ 1/14).
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 12 , 2025 | 05:22 AM