ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wrestler Ritika: డోప్‌ పరీక్షలో విఫలం రెజ్లర్‌ రీతికపై సస్పెన్షన్‌

ABN, Publish Date - Jul 09 , 2025 | 05:21 AM

గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరిన భారత యువ మహిళా రెజ్లర్‌ రీతిక హుడా డోప్‌ పరీక్షలో విఫలమైంది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ శిక్షణ శిబిరం సెలెక్షన్‌...

న్యూఢిల్లీ: గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరిన భారత యువ మహిళా రెజ్లర్‌ రీతిక హుడా డోప్‌ పరీక్షలో విఫలమైంది. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ శిక్షణ శిబిరం సెలెక్షన్‌ ట్రయల్స్‌లో భాగంగా జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోప్‌ పరీక్షలో రీతిక (76 కిలోలు) పాజిటివ్‌గా తేలింది. దీంతో రీతిక వెంటనే శిక్షణ శిబిరాన్ని వీడింది. తక్షణమే ఆమెపై సస్పెన్షన్‌ విధిస్తున్నట్టు నాడా ప్రకటించింది. ఈనెల 7 నుంచి సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా, రీతికపై ఏడాదిపాటు నిషేధం విధించే అవకాశముందని సమాచారం. రీతికతో పాటు మరో ఇద్దరు రెజ్లర్లు కూడా డోప్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో వారు కూడా తాత్కాలిక సస్పెన్షన్‌కు గురైనట్టు తెలిసింది. దేశ టాప్‌ రెజ్లర్లలో ఒకరైన 22 ఏళ్ల రీతిక.. ఈ ఏడాది ఆరంభంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, మేలో జరిగిన ఉలాన్‌బాటర్‌ ర్యాంకింగ్‌ సిరీ్‌సలో స్వర్ణం గెలిచింది.

ఇవీ చదవండి:

సీఎస్‌కేను దాటేసిన ఆర్సీబీ

నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ

అందుకే 400 వద్దనుకున్నా..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 05:21 AM