వైల్డ్‌కార్డ్ సంచలనం
ABN, Publish Date - Jun 05 , 2025 | 05:08 AM
క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో స్థానిక క్రీడాకారిణి లోయిస్ బోయిసన్ సంచలన ప్రదర్శన కనబరచింది. వైల్డ్‌కార్డ్‌తో టోర్నీలో ఆడుతున్న ఈ ఫ్రెంచ్ భామ క్వార్టర్‌ఫైనల్లో...
క్వార్టర్స్‌లో ఆండ్రీవాకు బోయిసన్ షాక్
ఫ్రెంచ్ ఓపెన్ సెమీ్‌సకు అల్కారజ్, సినర్
పారిస్: క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో స్థానిక క్రీడాకారిణి లోయిస్ బోయిసన్ సంచలన ప్రదర్శన కనబరచింది. వైల్డ్‌కార్డ్‌తో టోర్నీలో ఆడుతున్న ఈ ఫ్రెంచ్ భామ క్వార్టర్‌ఫైనల్లో అదరగొట్టింది. బుధవారం జరిగిన సింగిల్స్ పోరులో ప్రపంచ 361 ర్యాంకరైన బోయిసన్ 7-6(6), 6-3తో ఆరోసీడ్ మిర్రా ఆండ్రీవా (రష్యా)ను కంగుతినిపించింది. 1989లో మోనికా సెలెస్, జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత తన ఆరంభ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో సెమీస్ చేరిన తొలి క్రీడాకారిణిగా 22 ఏళ్ల బోయిసన్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. 1999లో అమేలీ మౌరెస్మో (వింబుల్డన్‌లో) తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్ చేరిన పిన్నవయసు ఫ్రెంచ్ క్రీడాకారిణిగానూ ఘనత వహించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో రెండోసీడ్ కొకొ గాఫ్ (అమెరికా)తో బోయిసన్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్వార్టర్‌ఫైనల్లో గాఫ్ 6-7 (8), 6-4, 6-1తో తన దేశానికే చెందిన ఏడో సీడ్ మాడిసన్ కీస్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్ జానిక్ సినర్, రెండో సీడ్ కార్లోస్ అల్కారజ్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో సినర్ 6-1, 7-5, 6-0తో అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)పై, అల్కారజ్ 6-0, 6-1, 6-4తో 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా)పై అలవోకగా గెలుపొందారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 05 , 2025 | 05:08 AM