ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lowest Test Innings Score: వెస్టిండీస్‌ 27 ఆలౌట్‌

ABN, Publish Date - Jul 16 , 2025 | 03:25 AM

దశాబ్దాలపాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌.. తమ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చింది. ఆస్ట్రేలియాతో సోమవారం ముగిసిన మూడో టెస్టులో 204 పరుగుల ఛేదన కోసం...

టెస్టు చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు

9 రన్స్‌కే ఆరు వికెట్లు తీసిన స్టార్క్‌

బోలాండ్‌ హ్యాట్రిక్‌

ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీ్‌ప

కింగ్‌స్టన్‌: దశాబ్దాలపాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌.. తమ చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చింది. ఆస్ట్రేలియాతో సోమవారం ముగిసిన మూడో టెస్టులో 204 పరుగుల ఛేదన కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ జట్టు కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. ఏడుగురు బ్యాటర్లు డకౌట్లు కాగా, జస్టిన్‌ గ్రీవ్స్‌ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. దీంతో 176 రన్స్‌ తేడాతో నెగ్గిన ఆసీస్‌ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఇది కరీబియన్‌ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు (27 ఆలౌట్‌). అయితే న్యూజిలాండ్‌ పేరిట ఉన్న అత్యంత చెత్త ప్రదర్శన (ఇంగ్లండ్‌పై 1955లో 26 ఆలౌట్‌)కు మరో పరుగు దూరంలో నిలిచి కాస్త పరువు కాపాడుకుంది. ఇక ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (7.3-4-9-6) నిప్పులు చెరిగే బంతులతో తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చి ఆరు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. లూయి్‌సను అవుట్‌ చేయడం ద్వారా స్టార్క్‌ కెరీర్‌లో 400 వికెట్ల మైలురాయిని చేరాడు. స్టార్క్‌.. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లతో బెంబేలెత్తించాడు. స్టార్క్‌కు తోడు మరో పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌ హ్యాట్రిక్‌ తీయడంతో విండీస్‌ కుదేలైంది. అంతకుముందు ఆసీస్‌ నాలుగో రోజు 99/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించి 121 పరుగులకే ఆలౌటైంది. అల్జారి జోసె్‌ఫకు ఐదు, షామర్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225, వెస్టిండీస్‌ 143 పరుగులు చేశాయి. స్టార్క్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గానూ నిలిచాడు.

రికార్డుల హోరు

ఈ టెస్టు మొత్తమ్మీద ఒక్క అర్ధసెంచరీ కూడా నమోదు కాలేదు. చివరిసారిగా 2015లో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాగ్‌పూర్‌ టెస్టులో ఇలా జరిగింది.

ఒక ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు డకౌటవడం 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి.

టెస్టుల్లో తొలి 15 బంతుల్లోనే ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్‌ స్టార్క్‌. గతంలో ఎర్నీ టోషాక్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లండ్‌), బోలాండ్‌ (ఆస్ర్టేలియా) 19 బంతుల్లో 5 వికెట్లు సాధించారు.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 121కే ఆలౌటైంది. వెస్టిండీ్‌సపై ఆసీ్‌సకు గత 30 ఏళ్లలో ఇదే అత్యల్ప స్కోరు.

ఇవీ చదవండి:

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

ఎంత పని చేశావ్ ఆర్చర్?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:26 AM