విఘ్నేష్ స్థానంలో రఘు శర్మ
ABN, Publish Date - May 02 , 2025 | 02:12 AM
ముంబై ఇండియన్స్ లెఫ్టామ్ స్పిన్నర్ విఘ్నేష్ పుతుర్ గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తాజా సీజన్‌లోనే అరంగేట్రం చేసిన తను ఐదు మ్యాచ్‌ల్లో...
ముంబై: ముంబై ఇండియన్స్ లెఫ్టామ్ స్పిన్నర్ విఘ్నేష్ పుతుర్ గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తాజా సీజన్‌లోనే అరంగేట్రం చేసిన తను ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. అతడి స్థానంలో జట్టు 32 ఏళ్ల పంజాబ్ లెగ్ స్పిన్నర్ రఘు శర్మను ఎంపిక చేసుకుంది. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో అతడు 57 వికెట్లు తీశాడు. అలాగే గత విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరఫున పేసర్ అర్షదీప్ తర్వాత 14 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ పేస్ బౌలర్ సందీప్ శర్మ కూడా రాబోయే అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గుజరాత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సందీప్ చేతి వేలికి గాయమైంది. వైద్య పరీక్షల్లో దాన్ని ఫ్రాక్చర్‌గా నిర్ధారించారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 02 , 2025 | 02:12 AM