ఆధారాలున్నాయి
ABN, Publish Date - May 28 , 2025 | 05:15 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీపై హెచ్‌సీఏ పెద్దలు...
సన్‌రైజర్స్‌ను జగన్మోహన్ అదనపు టికెట్లు అడిగారు
నిర్ధారించిన విజిలెన్స్
హెచ్‌సీఏ పై చర్యలకు సిఫారసు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీపై హెచ్‌సీఏ పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చినట్టు విజిలెన్స్ నిర్ధారించింది. వ్యక్తిగతంగా తనకు అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు ఫ్రాంచైజీని ఇబ్బందులకు గురిచేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఒప్పందం ప్రకారం ప్రతి మ్యాచ్‌కూ స్టేడియం కెపాసిటీలో పదిశాతం టికెట్లను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ హెచ్‌సీఏకు ఇస్తూ వచ్చింది. అయితే అదనంగా తమకు మరో పదిశాతం టికెట్లు కావాలని, వీవీఐపీ బాక్స్‌ల్లోనూ వాటా ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు ఫ్రాంచైజీపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇలాగైతే తాము హైదరాబాద్‌ను వీడి వెళ్లిపోతామంటూ సన్‌రైజర్స్ ప్రకటన చేసిన నేపధ్యంలో దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. ఈ క్రమంలో హైదరాబాద్ రూరల్ విజిలెన్స్ విభాగం సుదీర్ఘ విచారణ జరిపి హెచ్‌సీఏ బెదిరింపులు నిజమేనని నిర్ధారించింది.
వీవీఐపీ గ్యాలరీలోని బాక్స్ రూములకు తాళం వేసినదీ వాస్తవమేనని విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. లఖ్‌నవూ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్టు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వానికి ప్రాఽథమిక నివేదికను అందచేసి చర్యలకు సిఫారసు చేశారు.
ఇవీ చదవండి:
టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 28 , 2025 | 05:23 AM