Under 19 ODI Match: వైభవ్ ధనాధన్..
ABN, Publish Date - Jun 28 , 2025 | 04:36 AM
వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 48) చెలరేగడంతో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్...
భారత అండర్-19 జట్టు బోణీ
హోవ్ (ఇంగ్లండ్): వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 48) చెలరేగడంతో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ అండర్-19 జట్టు 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. రాకీ ఫ్లింటాఫ్ (56), ఇసాక్ మహ్మద్ (42) మాత్రమే రాణించారు. కనిష్క్ చౌహాన్ మూడు, అంబరీష్, మహ్మద్ ఇనాన్, హెనిల్ పటేల్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 24 ఓవర్లలో 178/4 స్కోరు చేసి నెగ్గింది.
Updated Date - Jun 28 , 2025 | 04:38 AM