పెగులాకు ఝలక్
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:09 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్ లోయిస్ బోయిస్సన్ సంచలనం సృష్టించింది. మూడో సీడ్ జెస్సికా పెగులాను ఓడించిన బోయిస్సన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కొకో గాఫ్, నొవాక్ జొకోవిచ్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మిర్రా...
క్వార్టర్స్‌కు గాఫ్, జొకో, జ్వెరెవ్ ఫ ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో అన్‌సీడెడ్ లోయిస్ బోయిస్సన్ సంచలనం సృష్టించింది. మూడో సీడ్ జెస్సికా పెగులాను ఓడించిన బోయిస్సన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కొకో గాఫ్, నొవాక్ జొకోవిచ్, మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, మిర్రా ఆండ్రీవ కూడా రౌండ్-8లోకి అడుగుపెట్టారు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 21 ఏళ్ల లోయిస్ బోయిస్సన్ (ఫ్రాన్స్) 3-6, 6-4, 6-4తో పెగులాకు షాకిచ్చింది. రెండో సీడ్ గాఫ్ 6-0, 7-5తో అలెగ్జాండ్రోవాపై, ఆండ్రీవ 6-3, 7-5తో కసట్‌కినా (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ 6-3, 7-5తో హేలీ బాప్టిస్ట్‌పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 6-2, 6-3, 6-2తో కామెరూన్ నోరిపై నెగ్గగా.. జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్‌కు వాకోవర్ లభించింది. టాలన్ గ్రీక్‌స్పూర్‌తో పోరులో 6-4, 3-0తో జ్వెరెవ్ ఆధిక్యంలో ఉన్నప్పుడు.. ప్రత్యర్థి గాయంతో తప్పుకొన్నాడు. ఐదో సీడ్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) 7-5, 3-6, 2-6, 4-6తో అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్) చేతిలో ఓడాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 05:09 AM