ఎండవేడిమికి తాళలేక పిచ్‌పైనే ప్రాణాలు విడిచి..
ABN, Publish Date - Mar 19 , 2025 | 05:15 AM
ఎండవేడిమిని తట్టుకోలేక ఓ క్రికెటర్ పిచ్‌పైనే ప్రాణాలు విడిచాడు. పాకిస్థాన్ మూలాలున్న క్లబ్ క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ (40) డీహైడ్రేషన్‌తో మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలాడు. 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలో...
అడిలైడ్: ఎండవేడిమిని తట్టుకోలేక ఓ క్రికెటర్ పిచ్‌పైనే ప్రాణాలు విడిచాడు. పాకిస్థాన్ మూలాలున్న క్లబ్ క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ (40) డీహైడ్రేషన్‌తో మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలాడు. 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలో జరిగిన ఈ మ్యాచ్‌లో ద ఓల్డ్ కాంకార్డియన్స్ క్లబ్ తరఫున ఆడుతున్న జునైద్ దాదాపు 40 ఓవర్లపాటు ఫీల్డింగ్ చేసిన అనంతరం బ్యాటింగ్‌కు దిగాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహతప్పి పిచ్‌పైనే పడిపోయాడు. తక్షణం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినా వైద్యులు ప్రాణాలు కాపాడలేక పోయారు. రంజాన్ నెల కావడంతో అతడు ఉపవాసం ఉన్నాడని అంటున్నారు. అయితే, సహచరులు మాత్రం అతడు మంచినీరు తాగినట్టు చెప్పారు.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2025 | 05:15 AM