ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

British Irish Para Tournament: తులసి నిత్యకు స్వర్ణాలు

ABN, Publish Date - Jul 28 , 2025 | 02:37 AM

అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు సత్తా చాటారు. యూకేలోని కార్డి్‌ఫలో జరిగిన బ్రిటిష్‌, ఐరిష్‌ పారా టోర్నీలో తులసి మురుగేశన్‌, నిత్య శ్రీ సుమతి సివాన్‌ సింగిల్స్‌లో పసిడి పతకాలు కొల్లగొట్టారు...

బ్రిటిష్‌, ఐరిష్‌ పారా బ్యాడ్మింటన్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు సత్తా చాటారు. యూకేలోని కార్డి్‌ఫలో జరిగిన బ్రిటిష్‌, ఐరిష్‌ పారా టోర్నీలో తులసి మురుగేశన్‌, నిత్య శ్రీ సుమతి సివాన్‌ సింగిల్స్‌లో పసిడి పతకాలు కొల్లగొట్టారు. మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ5 కేటగిరి ఫైనల్లో తులసి 18-21, 21-17, 21-16తో భారత్‌కే చెందిన మనీషా రామదా్‌సను ఓడించింది. ఎస్‌హెచ్‌6 సింగిల్స్‌ తుదిపోరులో నిత్యశ్రీ 21-11, 21-23, 21-11తో గిలియానా పొవెడ (పెరూ)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో సుకాంత్‌ (ఎస్‌ఎల్‌4), కృష్ణ నగర్‌ (ఎస్‌హెచ్‌6) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల డబుల్స్‌ డబ్ల్యూహెచ్‌1 కేటగిరిలో ప్రేమ్‌ కుమార్‌/అబూ హుబైదా జోడీకి కాంస్యం, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌హెచ్‌6 విభాగంలో కృష్ణా నగర్‌/నిత్యశ్రీ జంటకు కాంస్యం దక్కాయి. మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో మన్‌దీప్‌ కౌర్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌3లో మన్‌దీ్‌ప/చిరాగ్‌ ద్వయం కాంస్యాలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 02:37 AM