టాప్ 3లో తిలక్
ABN, Publish Date - Jun 12 , 2025 | 05:24 AM
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-3లోకి దూసుకొచ్చాడు. బుధవారం ఐసీసీ విడుదలజేసిన ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో తిలక్ ఓ స్థానం ఎగబాకి మూడో ర్యాంక్‌లో...
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-3లోకి దూసుకొచ్చాడు. బుధవారం ఐసీసీ విడుదలజేసిన ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో తిలక్ ఓ స్థానం ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. తిలక్ 804 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. భారత్‌కే చెందిన అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ (856) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బౌలర్ల విభాగంలో భారత్ నుంచి వరుణ్ చక్రవర్తి 3, రవి బిష్ణోయ్ 7, అర్ష్‌దీప్ 10వ ర్యాంక్‌లతో టాప్‌టెన్‌లో కొనసాగుతున్నారు.
హాంప్‌షైర్ క్లబ్ తరఫున..
హైదరాబాద్: టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఈ ఎడమచేతివాటం బ్యాటర్ హాంప్‌షైర్ క్లబ్ తరఫున కౌంటీ చాంపియన్‌షి్‌పలో పోటీపడనున్నాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) బుధవారం ప్రకటించింది. యూకే కౌంటీ చాంపియన్‌షి్‌పలో తమ తరపున ఆడాలంటూ హాంప్‌షైర్ క్లబ్ తిలక్‌ను సంప్రదించిందనీ, అందుకు అతను కూడా అంగీకరించాడని తెలిపింది. 22 ఏళ్ల తిలక్ భారత్ తరఫున 25 టీ20లు, 4 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో 749, వన్డేల్లో 68 పరుగులు సాధించాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 12 , 2025 | 05:24 AM