ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thrilling Victory: చివరి బంతికి హోల్డర్‌ బౌండరీ

ABN, Publish Date - Aug 04 , 2025 | 02:51 AM

పొట్టి క్రికెట్‌ ఫ్యాన్స్‌లో ఎందుకంత క్రేజో నిరూపించింది వెస్టిండీ్‌స-పాకిస్థాన్‌ రెండో టీ20. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం...

పాకిస్థాన్‌తో రెండో టీ20లో వెస్టిండీస్‌ ఉత్కంఠ గెలుపు

లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): పొట్టి క్రికెట్‌ ఫ్యాన్స్‌లో ఎందుకంత క్రేజో నిరూపించింది వెస్టిండీ్‌స-పాకిస్థాన్‌ రెండో టీ20. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం అందుకున్న విండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో 1-1తో సమంగా నిలిచింది. బౌలింగ్‌లో తొలుత నాలుగు వికెట్లతో పాకిస్థాన్‌ను కట్టడి చేసిన ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ (4/19, 16 నాటౌట్‌)..చివరి బంతికి బౌండరీ బాది విండీ్‌సను విజయ పథాన నిలిపాడు. మ్యాచ్‌లో తొలుత పాక్‌ 20 ఓవర్లలో 133/9 స్కోరుకు పరిమితమైంది. హసన్‌ నవాజ్‌ (40) టాప్‌ స్కోరర్‌. మోటీ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో విండీస్‌ 20 ఓవర్లలో 135/8 స్కోరు చేసి నెగ్గింది. మోటీ (28), హోప్‌ (21) పర్లేదనిపించారు. ఆఖరి ఓవర్లో 8 రన్స్‌ కావాల్సిన వేళ..అఫ్రీది రెండో బంతికి షెఫర్డ్‌ను అవుట్‌ చేశాడు. హోల్డర్‌తోపాటు కొత్త బ్యాటర్‌ షామర్‌ జోసెఫ్‌ తుదుపరి మూడు బంతుల్లో మూడు పరుగులే చేశారు. మరుసటి బంతిని అఫ్రీది వైడ్‌గా వేయడంతో.. చివరి బంతికి విండీస్‌ మూడు రన్స్‌ చేయాలి. ఈ దశలో ఒత్తిడిని అదిమిపట్టిన హోల్డర్‌ బంతిని బౌండరీకి తరలించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..

ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 04 , 2025 | 02:51 AM