ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు స్విమ్మర్ల పతకాల పంట

ABN, Publish Date - May 07 , 2025 | 04:25 AM

ఖేలో ఇండియా యువజన క్రీడల్లో మంగళవారం తెలుగు స్విమ్మర్లు పతకాల పంట పండించారు. తెలంగాణకు చెందిన వర్షిత్‌ (బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే), సుహాస్‌ ప్రీతమ్‌...

ఖేలో ఇండియా యువజన క్రీడలు

పట్నా/న్యూఢిల్లీ: ఖేలో ఇండియా యువజన క్రీడల్లో మంగళవారం తెలుగు స్విమ్మర్లు పతకాల పంట పండించారు. తెలంగాణకు చెందిన వర్షిత్‌ (బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే), సుహాస్‌ ప్రీతమ్‌ (బాలుర 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌), శ్రీనిత్య సాగి (బాలికల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌) తమ విభాగాల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రానికి మూడు స్వర్ణాలు అందించారు. ఇక, ఒక కిలోమీటర్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో సాయిచరణ్‌ యాదవ్‌ కాంస్యం నెగ్గి తెలంగాణ ఖాతాలో నాలుగో పతకాన్ని చేర్చాడు. స్విమ్మింగ్‌ 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంపత్‌కుమార్‌ యాదవ్‌, తీర్థు సామదేవ్‌ వరుసగా స్వర్ణ, కాంస్యాలు దక్కించుకున్నారు. ఇక, 400 మీ. వ్యక్తిగత మెడ్లేలోనూ సత్తా చాటుతూ తీర్థు సామదేవ్‌ రజతం గెలిచాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 04:25 AM